అందరూ ప్రశంసిస్తున్నారు
ABN, Publish Date - Aug 25 , 2024 | 04:50 AM
ఇటీవలే ‘ఆయ్’ సినిమాకు ఆకట్టుకునే సంగీతాన్ని అందించారు అజయ్ అరసాడ. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నేను ‘ఆయ్’ చిత్రంలో...
ఇటీవలే ‘ఆయ్’ సినిమాకు ఆకట్టుకునే సంగీతాన్ని అందించారు అజయ్ అరసాడ. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నేను ‘ఆయ్’ చిత్రంలో సంగీతం అందించిన మూడు పాటలు అందరికీ విపరీతంగా నచ్చాయి. పాటలతో పాటు నేపథ్య సంగీతానికి విశేషాదరణ లభిస్తోంది. ఎంతో మంది మంచి సంగీతం ఇచ్చావని ప్రశంసిస్తున్నారు. ఓ సంగీత దర్శకుడిగా అన్ని జోనర్ సినిమాలు చేయాలనుంది. ప్రస్తుతం రెండు చిత్రాలకి సంగీతం అందిస్తున్నాను’’ అని చెప్పారు.