అన్ని వర్గాలను అలరిస్తుంది

ABN, Publish Date - Dec 20 , 2024 | 02:01 AM

వెన్నెల కిశోర్‌ టైటిల్‌ రోల్‌ పోషించిన చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్‌ హోమ్స్‌’. మోహన్‌ దర్శకత్వంలో వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు. నిర్మాత వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు....

వెన్నెల కిశోర్‌ టైటిల్‌ రోల్‌ పోషించిన చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్‌ హోమ్స్‌’. మోహన్‌ దర్శకత్వంలో వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు. నిర్మాత వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు. ఈ నెల 25న చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం గురువారం ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. వంశీ నందిపాటి మాట్లాడుతూ ‘‘శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్‌’ చిత్రం ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఈ చిత్రం అలరిస్తుంది. ఈ సినిమాకు కథే హీరో. కథను నమ్మే ముందుకు వెళుతున్నాను. ఈ సినిమాతో మంచి విజయం వస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు. అనన్య నాగళ్ల మాట్లాడుతూ ‘నటిగా నాలోని ప్రతిభను వెలికితీసేలా ఈ చిత్రంలో నా పాత్ర ఉంటుంది. కథను మలచిన తీరు సరికొత్తగా ఉండి ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమాతో మంచి విజయం వస్తుందనే నమ్మకం ఉంది’ అని చెప్పారు.

Updated Date - Dec 20 , 2024 | 02:01 AM