అలరించే కుర్రోళ్లు

ABN, Publish Date - Aug 07 , 2024 | 12:55 AM

అంతా కొత్త వారితో నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. యదు వంశీ దర్శకుడు. తెలుగు రాష్ట్రాల్లో వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు...

అంతా కొత్త వారితో నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. యదు వంశీ దర్శకుడు. తెలుగు రాష్ట్రాల్లో వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు. సోమవారం జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో వరుణ్‌ తేజ్‌, సాయిదుర్గ తేజ్‌, అడవి శేష్‌, నాగబాబు, వెంకీ అట్లూరి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో చిత్ర సమర్పకురాలు నిహారిక కొణిదెల మాట్లాడుతూ ‘పదిహేను మంది కొత్త ఆర్టిస్టులను పరిశ్రమకు అందిస్తున్నాను..అనే తృప్తి నాకు ఉంది. చిత్ర దర్శకుడు వంశీ పేరు ఇకపై ఎక్కువగా వినిపిస్తుంది’ అని చెప్పారు. చిత్రం పెద్ద హిట్‌ కావాలని అతిధులు కోరారు.

Updated Date - Aug 07 , 2024 | 12:55 AM