ఏకమైన హృదయాలు
ABN, Publish Date - Aug 11 , 2024 | 12:41 AM
నాగచైతన్యతో తన నిశ్చితార్థం ఫొటోలను శోభితా దూళిపాళ్ల సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఆమె చైతూతో కలసి ఊయలలో కూర్చున్న ఫొటోలు...
నాగచైతన్యతో తన నిశ్చితార్థం ఫొటోలను శోభితా దూళిపాళ్ల సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఆమె చైతూతో కలసి ఊయలలో కూర్చున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. ‘మన పరిచయం ఎలా జరిగితేనేం, మన హృదయాలు ప్రేమలో మమేకమయ్యాయి. విడిపోలేనంతగా అవి ఏకమయ్యాయి’ అంటూ ఆమెనాగచైతన్యపై తన ప్రేమను వ్యక్తం చేశారు. నిశ్చితార్థం తర్వాత శోభిత ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన తొలి పోస్ట్ ఇదే. దీన్ని నాగచైతన్య తన ఖాతాలో రీ పోస్ట్ చేశాడు.