ఎనిమిది గంటల పెళ్లి
ABN, Publish Date - Nov 26 , 2024 | 03:57 AM
నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ళ డిసెంబరు 4న ఒక ఇంటివారవుతున్న సంగతి తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియో్‌సలో జరగనున్న వీరి వివాహం పూర్తిగా బ్రాహ్మణ సంప్రదాయాల ప్రకారం...
నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ళ డిసెంబరు 4న ఒక ఇంటివారవుతున్న సంగతి తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియో్‌సలో జరగనున్న వీరి వివాహం పూర్తిగా బ్రాహ్మణ సంప్రదాయాల ప్రకారం దాదాపు ఎనిమిది గంటల పాటు జరగనుందట. శోభిత తల్లితండ్రుల కోరిక మేరకే ఈ పద్ధతిలో వీరి పెళ్లి జరుగుతోందని తెలిసింది. డిసెంబరు 4న రాత్రి 8:13 నిమిషాలకు పెళ్లి ముహూర్తాన్ని నిశ్చయించారని తెలుస్తోంది. నయనతార, విఘ్నేశ్ శివన్‌ల మాదిరిగానే వీరి పెళ్లి స్ట్రీమింగ్ హక్కులనూ ఓ ఓటీటీ సంస్థకు ఇస్తున్నారట. కాగా, ఇటీవలే జరిగిన నాగచైతన్య పుట్టినరోజు వేడుకల్లో శోభిత పాల్గొన్న ఫొటోలను సుశాంత్ షేర్ చేశారు.