Breaking News: బాలయ్య సినిమాలో దుల్కర్ అవుట్, అతని ప్లేస్ లో ఎవరంటే...

ABN, Publish Date - Jun 26 , 2024 | 03:30 PM

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కెఎస్ రవీంద్ర సినిమా #NBK109 నుండి మలయాళం సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ తప్పుకున్నాడు అని తాజా సమాచారం. చిత్ర నిర్వాహకులు అతనికి బదులుగా ఎవరిని తీసుకున్నారో తెలిస్తే షాకవుతారు.

Nandamuri Balakrishna and Dulquer Salman

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కెఎస్ రవీంద్ర (బాబీ) కాంబినేషన్ లో వస్తున్న సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా టైటిల్ ఇంకా ప్రకటించలేదు అందుకని ఇంతవరకు ఈ సినిమాని #NBK109 అని పిలుస్తున్నారు. ఈ సినిమాలో ఊర్వశి రౌటేలా ఒక ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ ఇంకొక ప్రధాన పాత్ర పోషిస్తారని ఇంతకు ముందు వార్తలు చాలానే వచ్చాయి. (Dulquer Salman is out of Balakrishna and Bobby Kolli #NBK109 film)

అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం దుల్కర్ సల్మాన్ ఈ సినిమా నుండి తప్పుకున్నట్టుగా తెలిసింది. అతని తేదీలు సరిగ్గా కుదరకపోవడంతో దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో చెయ్యడం లేదు అని తాజా సమాచారం. అతని ప్లేస్ లో ఎవరిని పెట్టాలా అని అలోచించి దర్శకుడు బాబీ ఆ పాత్రని ఏమి చేశారో తెలిస్తే షాకవుతారు. (Dulquer Salman is not doing #NBK109 film, he is going to replace by an actress)

దుల్కర్ కి బదులుగా వేరే నటుడిని ముందు అనుకున్నారు, కానీ మళ్ళీ దర్శకుడు అలోచించి ఆ పాత్రని స్త్రీ పాత్రగా మార్చినట్టు భోగట్టా. అంటే ఇప్పుడు ఆ పాత్రలో నటుడికి బదులుగా ఒక నటిని తీసుకోవాలని యోచిస్తున్నారు. దర్శకుడు ఆలోచనలో ఒకరిద్దరు వున్నట్టుగా తెలిసింది, అందులో 'విరూపాక్ష' కథానాయకురాలు సంయుక్త పేరు వినబడుతోంది.

బాలకృష్ణ ఇప్పుడు ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారని తెలిసింది. త్వరలోనే బాలకృష్ణ, ఊర్వశి రౌటేలా పై అన్నపూర్ణ స్టూడియో లో ఒక పాట చిత్రీకరణ కూడా జరగబోతోంది అని కూడా తెలిసింది. ఈ సినిమా చిత్రీకరణ కూడా చాలా తొందరగా జరుగుతున్నట్టుగా సమాచారం. ఈ సినిమా సితార ఎంటర్ టైనమెంట్ బ్యానర్ లో నాగ వంశి, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

Updated Date - Jun 26 , 2024 | 03:30 PM