మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lucky Baskhar: దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ విడుదల ఎప్పుడంటే..

ABN, Publish Date - May 29 , 2024 | 08:26 PM

పాన్ ఇండియా యాక్టర్‌గా దూసుకుపోతున్న దుల్కర్ సల్మాన్.. తన వ్యక్తిత్వం, అణుకువతో కూడిన నటనా నైపుణ్యాలతో మలయాళం, తెలుగు, తమిళం అలాగే హిందీ భాషలలో అత్యంత డిమాండ్ ఉన్న నటులలో ఒకరిగా మారారు. ఇప్పుడు దుల్కర్ ‘లక్కీ భాస్కర్’ అనే సాధారణ మనిషికి చెందిన అసాధారణ కథతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ లాక్ చేశారు.

Lucky Baskhar Movie Still

పాన్ ఇండియా యాక్టర్‌గా దూసుకుపోతున్న దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan).. తన వ్యక్తిత్వం, అణుకువతో కూడిన నటనా నైపుణ్యాలతో మలయాళం, తెలుగు, తమిళం అలాగే హిందీ భాషలలో అత్యంత డిమాండ్ ఉన్న నటులలో ఒకరిగా మారారు. ఇప్పుడు దుల్కర్ ‘లక్కీ భాస్కర్’ అనే సాధారణ మనిషికి చెందిన అసాధారణ కథతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుండి, మేకర్స్ రెగ్యులర్ అప్‌డేట్‌లను విడుదల చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమా 27 సెప్టెంబర్, 2024న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు.

*Kiraak RP: అమ్మాయిలతో నగ్న పూజలు చేయిస్తున్నాడంటూ వేణు స్వామిపై కిరాక్ ఆర్పీ ఫైర్..

‘తొలిప్రేమ, సార్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల రచయిత-దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా.. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. నిమిష్ రవి సినిమాటోగ్రాఫర్‌గా, బంగ్లాన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. (Lucky Baskhar Release Date Locked)


1980- 1990 పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో.. నాటి బొంబాయి(ముంబై) నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని మేకర్స్ తెలిపారు. సాధారణ బ్యాంకు క్యాషియర్ లక్కీ భాస్కర్ యొక్క ఆసక్తికరమైన, అసాధారణమైన జీవిత ప్రయాణాన్ని ఈ సినిమా తెలియజేస్తుంది. దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల విడుదలైన టీజర్ ఈ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రాన్ని తెలుగు, మలయాళం, హిందీ మరియు తమిళ భాషలలో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో థియేటర్లలో విడుదల చేయనున్నారు. విభిన్న కథతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడానికి దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి శాయశక్తులా కృషి చేస్తున్నారని.. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు. (Lucky Baskhar Latest Update)

Read Latest Cinema News

Updated Date - May 29 , 2024 | 08:26 PM