Dulquer Salmaan: అప్పుడు తెలుగు రాదన్నాను.. ఈరోజు ఇలా నిలబెట్టేశారు
ABN, Publish Date - Nov 03 , 2024 | 05:15 PM
‘లక్కీ భాస్కర్’ సినిమాకి, ఇందులోని పాత్రలకు ప్రాణం పోసిన వెంకీ అట్లూరికి థాంక్స్ చెప్పారు హీరో దుల్కర్ సల్మాన్. ‘మహానటి’, ‘సీతారామం’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతోన్న నేపథ్యంలో.. చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది.
‘లక్కీ భాస్కర్’ సినిమాకి, ఇందులోని పాత్రలకు ప్రాణం పోసిన వెంకీ అట్లూరికి థాంక్స్ చెప్పారు హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). ‘మహానటి’, ‘సీతారామం’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. వెంకీ అట్లూరి దర్శకుడు. మీనాక్షి చౌదరి కథానాయిక. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌తో సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఆదివారం సక్సెస్ మీట్‌ను ఘనంగా నిర్వహించింది.
Also Read-Malavika Mohanan: టాలీవుడ్ ఎంట్రీనే ప్రధానం.. ప్రభాసే కాపాడాలి
ఈ కార్యక్రమంలో హీరో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. శ్రీనాథ్ మాగంటి, మాణిక్ రెడ్డి, శివన్నారాయణ, శశిధర్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, మహేష్, రిత్విక్, బెనర్జీ గారు, సాయి కుమార్ గారు అందరితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. సాయి కుమార్‌గారి వాయిస్ అనేది ఆయనకు మాత్రమే కాదు, సినీ పరిశ్రమకి బ్లెస్సింగ్. నా చిన్నప్పుడు రాంకీ గారి నటన అంటే ఇష్టం. ఇప్పుడు ఆయనతో కలిసి నటించడమనేది గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. షూటింగ్‌లో ఎంతో సహకరించారు. సుమతి పాత్రతో మీనాక్షి అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. సినిమా బ్లాక్ బస్టర్ అని నాకు ఫస్ట్ మెసేజ్ చేసింది జి.వి. ప్రకాష్. వెంకీ-జి.వి ఇద్దరూ డైనమిక్ కాంబో. నిర్మాతలకు జి.వి. ప్రకాష్ లాంటి టెక్నీషియన్స్ కావాలి. ఎందుకంటే పాటలు గానీ, నేపథ్య సంగీతం గానీ ఆలస్యం చేయరు. డీఓపీ నిమిష్, ప్రొడక్షన్ డిజైనర్ బంగ్లాన్, ఎడిటర్ నవీన్ అందరూ సినిమా అద్భుతంగా రావడానికి ఎంతో కృషి చేశారు.
తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరిస్తున్నారు. మీతో (తెలుగు ప్రేక్షకులు) నాకు మంచి అనుబంధం ఏర్పడింది. నాగి, స్వప్న ‘మహానటి’ కోసం నన్ను సంప్రదించినప్పుడు నాకు తెలుగు రాదు అన్నాను. కానీ నన్ను తీసుకొచ్చి, ఈరోజు ఇలా నిలబెట్టారు. ఆ తర్వాత హను గారు ‘సీతారామం’తో నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాన్ని అందించారు. ఇప్పుడు వెంకీ. చూడటానికి కుర్రాడిలా ఉంటాడు. కానీ ఎంతో ప్రతిభ ఉంది. అందుకే ఇంత గొప్ప సినిమాలు చేస్తున్నాడు. ‘లక్కీ భాస్కర్’ సినిమాకి, ఇందులోని పాత్రలకు ప్రాణం పోసిన వెంకీకి థాంక్స్. అలాగే ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు.