డబుల్‌ ఇంపాక్ట్‌

ABN, Publish Date - Aug 12 , 2024 | 03:10 AM

వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘మట్కా’. కరుణ కుమార్‌ దర్శకత్వంలో డాక్టర్‌ విజయేందర్‌రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు...

వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘మట్కా’. కరుణ కుమార్‌ దర్శకత్వంలో డాక్టర్‌ విజయేందర్‌రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ఆదివారం చిత్రబృందం డబుల్‌ ఇంపాక్ట్‌ పేరుతో ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. వరుణ్‌తేజ్‌ యువకుడిగా, మధ్య వయస్కుడిగా రెండు విభిన్న గెటప్పుల్లో అలరించారు. వింటేజ్‌ లుక్‌లో సిగార్‌ తాగుతూ కనిపించారు. పీరియాడికల్‌ బ్యాక్‌డ్రా్‌పలో సాగే ఈ చిత్రంలో మాఫియా లీడర్‌ పాత్రలో వరుణ్‌తేజ్‌ కనిపించనున్నారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహీ కథానాయికలు. సంగీతం: జీవీ ప్రకాశ్‌ కుమార్‌, సినిమాటోగ్రఫీ: ఏ కిశోర్‌కుమార్‌.

Updated Date - Aug 12 , 2024 | 03:10 AM