ఎవర్నీ కలవకూడదనుకున్నా

ABN, Publish Date - Oct 21 , 2024 | 03:28 AM

గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ నుంచి వరుస బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో భారీ భద్రత మధ్య బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ బిగ్‌ బాస్‌ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ షూట్‌కి సంబంధించిన ఒక ఎపిసోడ్‌ శనివారం ప్రసారమైంది...

గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ నుంచి వరుస బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో భారీ భద్రత మధ్య బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ బిగ్‌ బాస్‌ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ షూట్‌కి సంబంధించిన ఒక ఎపిసోడ్‌ శనివారం ప్రసారమైంది. ఈ సందర్భంగా సల్మాన్‌ ఖాన్‌ చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘నేను ఈ రోజు ఇక్కడికి రాకూడదనుకున్నా. అస్సలు రావాలనిపించలేదు. మీతో పాటు ఎవరినీ కలవకూడదనుకున్నా. వృత్తి పట్ల ఉన్న నిబద్ధత వల్ల ఇక్కడికి వచ్చాను’ అని సల్మాన్‌ అన్నారు. అయితే ముందు ఉన్నంత యాక్టీవ్‌గా ఈ ఎపిసోడ్‌లో సల్మాన్‌ కనిపించలేదు.

Updated Date - Oct 21 , 2024 | 03:28 AM