శ్రద్ధా ఇంటి రెంట్ ఎంతో తెలుసా?
ABN, Publish Date - Dec 04 , 2024 | 03:22 AM
‘స్త్రీ 2’ చిత్రం సూపర్ హిట్‌తో జోష్ మీద ఉన్నారు బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్. పారితోషికం కూడా అమాంతం పెంచేశారట. ఆమె చెబుతున్న రేట్లు వింటుంటే నిర్మాతలకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయని బీ టౌన్ టాక్. తెలుగులో ‘పుష్ఫ 2’ లో ఐటెం సాంగ్‌కు...
‘స్త్రీ 2’ చిత్రం సూపర్ హిట్‌తో జోష్ మీద ఉన్నారు బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్. పారితోషికం కూడా అమాంతం పెంచేశారట. ఆమె చెబుతున్న రేట్లు వింటుంటే నిర్మాతలకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయని బీ టౌన్ టాక్. తెలుగులో ‘పుష్ఫ 2’ లో ఐటెం సాంగ్‌కు మొదట శ్రద్ధనే అడిగారు. కానీ ఆమె చెప్పిన పారితోషికం విన్న తర్వాత మనసు మార్చుకుని శ్రీలీలను ఎంపిక చేశారు. అలాగే నాని హీరోగా రూపొందే సినిమాలో కూడా కేవలం పారితోషికం కారణంగా అవకాశం కోల్పోయారు శ్రద్ధ. ‘అయినా డోంట్ కేర్ .. నా సినిమాలు నాకు ఉంటాయి’ అనే రీతిలో శ్రద్ధా ప్రవర్తిస్తోందని చెబుతున్నారు. పారితోషికం విషయం పక్కనపెడితే, ఈ మధ్య ఆమె అద్దెకు తీసుకున్న ఫ్లాట్ గురించే ఇప్పుడు చర్చ జరుగుతోంది.
సినిమా వాళ్లంతా ఉండే జుహూ ప్రాంతంలో ఓ ఖరీదైన అపార్ట్‌మెంట్‌ను శ్రద్ధా రెంట్‌కు తీసుకుంది. అద్దె ఎంతో తెలుసా? నెలకు రూ.ఆరు లక్షలు. ఒక ఏడాది పాటు ఈ ఫ్లాట్‌ను లీజ్‌కు తీసుకున్న శ్రద్ధ సంవత్సరం అద్దె రూ. 72 లక్షలు ముందే కట్టేశారట. నాలుగు కార్లు పార్క్ చేసుకోవడానికి సదుపాయం ఉందట. సొంతంగా ఫ్లాట్ కొనుక్కునే స్థోమత ఉన్నా కూడా శ్రద్ధ కొనుక్కోకుండా అద్దె ఇంట్లోకి ఎందుకు వెళుతుందో ఆమెకే తెలియాలి!