ఆర్‌సి16లో దివ్యేందు
ABN, Publish Date - Dec 01 , 2024 | 06:36 AM
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ(ఆర్‌సి16-వర్కింగ్ టైటిల్)లో బాలీవుడ్ నటుడు దివ్యేందు కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘మీర్జాపూర్’ వెబ్‌సిరీ్‌సలో మున్నాభాయ్ పాత్రలో...
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ(ఆర్‌సి16-వర్కింగ్ టైటిల్)లో బాలీవుడ్ నటుడు దివ్యేందు కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘మీర్జాపూర్’ వెబ్‌సిరీ్‌సలో మున్నాభాయ్ పాత్రలో తనదైన నటనతో మెప్పించిన దివ్యేందు ఈ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సందర్భంగా దివ్యేందు పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను దర్శకుడు బుచ్చిబాబు విడుదల చేశారు. మెలితిప్పిన మీసం, రగ్డ్ లుక్‌తో దివ్యేందు పోస్టర్‌లో కనిపిస్తున్నారు. అనౌన్స్‌మెంట్ రోజు నుంచి అంచనాలు పెంచుతూ వస్తోన్న ఈ సినిమాను భారీ స్థాయిలో హై టెక్నికల్ వాల్యూ్‌సతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రూపొందిస్తున్నారు. కన్నడ నటుడు శివరాజ్‌కుమార్ కూడా ఈ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమలోకి ప్రవేశిస్తున్నారు. ఆయన చాలా పవర్‌ఫుల్ పాత్రలో మెప్పించబోతున్నారు. కథానాయికగా జాన్వీ కపూర్, కీలక పాత్రలో జగపతిబాబు నటిస్తున్నారు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే మైసూర్‌లో ప్రారంభమైంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బేనర్ సమర్పణలో వృద్ధి సినిమాస్ సంస్థపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.