విడాకులు... మీడియా ప్రచారమే
ABN, Publish Date - Aug 12 , 2024 | 03:13 AM
ఐశ్వర్యతో విడిపోతున్నట్లు వస్తున్న వదంతులపై అభిషేక్ బచ్చన్ ఎట్టకేలకు స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘కొన్ని ఆసక్తికర వార్తల కోసం....
ఐశ్వర్యతో విడిపోతున్నట్లు వస్తున్న వదంతులపై అభిషేక్ బచ్చన్ ఎట్టకేలకు స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘కొన్ని ఆసక్తికర వార్తల కోసం మీరు (మీడియా) ఇదంతా చేస్తున్నారు. మేం సెలబ్రిటీలం కాబట్టి ఇలాంటి వాటి గురించి పట్టించుకోను. నేను ఇంకా వివాహ బంధంలోనే ఉన్నాను. క్షమించండి’ అంటూ తన వేలికి ఉన్న నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపించాడు. దీంతో ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న అభిషేక్ తమపై వస్తున్న రూమర్లకు ప్రస్తుతానికి చెక్ పెట్టినట్లైంది. ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ దంపతులు విడిపోతున్నారంటూ గత కొంత కాలంగా ఉధృతంగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. అనంత్ అంబానీ పెళ్లికి విడివిడిగా హాజరడంతో వీరిద్దరూ నిజంగానే విడిపోతున్నారేమోనని భావించారు. ఐశ్వర్యతో విడిపోతున్నట్లు అభిషేక్ బచ్చన్ చెబుతున్న డీప్‌ఫేక్ వీడియో ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ అయింది.