Kumbha: పాన్ ఇండియా సినిమా ‘కుంభ’ మొదలైంది..

ABN, Publish Date - Aug 29 , 2024 | 06:47 PM

ద‌ర్శ‌కుడు వి స‌ముద్ర స్వీయ‌నిర్మాణంలో ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘కుంభ’. వి సముద్ర ఫిలిం బ్యానర్‌పై తెర‌కెక్కే ఈ చిత్ర ప్రారంభోత్స‌వం గురువారం హైద‌రాబాద్ ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ఘ‌నంగా జ‌రిగింది. హీరో విజ‌య్ రామ్‌పై ముహూర్త‌పు షాట్‌కు డీఎస్ రావు క్లాప్ కొట్ట‌గా, సముద్ర సతీమణి విజయలక్ష్మి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి స‌న్నివేశానికి చంద్రమహేష్, దేవి ప్రసాద్ గౌర‌వ ద‌ర్శ‌త్వం వ‌హించారు.

Kumbha Movie Opening

ద‌ర్శ‌కుడు వి స‌ముద్ర (Director V Samudra) స్వీయ‌నిర్మాణంలో ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘కుంభ’ (Kumbha). వి సముద్ర ఫిలిం బ్యానర్‌పై తెర‌కెక్కే ఈ చిత్ర ప్రారంభోత్స‌వం గురువారం హైద‌రాబాద్ ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ఘ‌నంగా జ‌రిగింది. హీరో విజ‌య్ రామ్‌ (Vijay Ram)పై ముహూర్త‌పు షాట్‌కు డీఎస్ రావు క్లాప్ కొట్ట‌గా, సముద్ర సతీమణి విజయలక్ష్మి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి స‌న్నివేశానికి చంద్రమహేష్, దేవి ప్రసాద్ గౌర‌వ ద‌ర్శ‌త్వం వ‌హించారు.

Also Read- Saripodhaa Sanivaaram: ‘సరిపోదా శనివారం’ మూవీ రివ్యూ

అనంతరం చిత్ర‌ ద‌ర్శ‌క‌నిర్మాత‌ వి సముద్ర (V Samudra) మాట్లాడుతూ.. బ‌ల‌మైన‌ కథ‌ల‌ను న‌మ్ముకుని కొత్త వాళ్ల‌తో 5 సినిమాలు చేస్తున్నాను. అందులో ‘కుంభ’ చిత్రం ఒక‌టి. నా సినిమాల‌కు ప‌ని చేసే టీమ్‌తోనే ‘కుంభ’ ప్రాజెక్టు చేస్తున్నాను. ఆరు భార‌తీయ భాష‌ల్లో ఈ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాను. ‘కుంభ’ సినిమాతో పాటు ‘వరద రాజు గోవిందం, రామ జన్మభూమి, ఇండియా సీఈఓ, ప్రొడక్షన్ నెం 5’’ వంటి సినిమాలు కూడా ఆరు భార‌తీయ భాష‌ల్లో పాన్ ఇండియా సినిమాలుగా చేయ‌బోతున్నాను. వి సముద్ర ఫిలిం బ్యానర్‌పై తెర‌కెక్కే ఈ ప్రాజెక్టుల‌ను ప్ర‌క‌టించ‌డం ఆనందంగా ఉంది. శ్రావణ గురువారం రోజును పురస్కరించుకొని మా పిల్లల సమక్షంలో సినిమా స్క్రిప్ట్ పూజ జరుపుకోవడం జరిగింది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న మా పిల్లల సినిమాని అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని అన్నారు. (Kumbha Movie Launched)


సంగీత దర్శకుడు వరంగల్ శ్రీను మాట్లాడుతూ.. వి సముద్ర గారు ప్రకటించనవన్నీ హిట్ టైటిల్సే. ఆయన ప్ర‌తి సినిమా.. ప్రతి ఊరిలో చెప్పుకుంటారు. ఆయ‌న సినిమాలోని పాటలు సందర్భోచితంగా ఉంటాయి. సముద్ర గారి సినిమాకు పని చేయడం నా అదృష్టం. జీవితమంతా ఈ అవ‌కాశాన్ని గుర్తుంచుకుంటానని అన్నారు. సముద్ర సినిమాలో అవకాశం ఇవ్వడం సంతోషంగా, గర్వంగా ఉంద‌ని హీరో విజ‌య్ రామ్ అన్నారు. ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రతో పరిచయం కాబోతున్న సూరజ్ ఆదిత్య సింగ్.. సముద్రకు ధన్యవాదాలు తెలిపారు. ఆధ్యాత్మికవేత్త రాజు చిత్ర‌యూనిట్‌కు దేవదేవతల ఆశీర్వాచనాలు అందజేశారు. సముద్ర గారి గత సినిమాల్లా.. ఈ సినిమా కూడా సూపర్ హిట్ కొడుతుందని కన్నా దేవరాజ్ భ‌రోసా వ్య‌క్తం చేశారు. మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని ఈ సందర్భంగా మేకర్స్ ప్రకటించారు.

Read Latest Cinema News

Updated Date - Aug 29 , 2024 | 06:47 PM