శ్రీతేజ్‌ను పరామర్శించిన దర్శకుడు సుకుమార్‌

ABN, Publish Date - Dec 20 , 2024 | 01:58 AM

పుష్పా 2 సినిమా ప్రీమియర్‌ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్‌ను గురువారం ఆ సినిమా దర్శకుడు సుకుమార్‌ పరామర్శించారు...

పుష్పా 2 సినిమా ప్రీమియర్‌ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్‌ను గురువారం ఆ సినిమా దర్శకుడు సుకుమార్‌ పరామర్శించారు. డిసెంబర్‌ 4న సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం విధితమే. ఘటన జరిగిన 15 రోజుల తరువాత ఆ సినిమా దర్శకుడు సుకుమార్‌ బాలుడి యోగ క్షేమాలు తెలుసుకోవడానికి కిమ్స్‌ ఆసుపత్రికి వచ్చి శ్రీతేజ్‌ ఆరోగ్య స్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.

రాంగోపాల్‌పేట్‌ (ఆంధ్రజ్యోతి)

Updated Date - Dec 20 , 2024 | 01:58 AM