మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Ravikula Raghurama: డైరెక్టర్ రాధాకృష్ణ వదిలిన ‘ప్రాణాలే’ పాట..

ABN, Publish Date - Mar 09 , 2024 | 05:44 PM

పాజిటివ్ వైబ్ ప్రొడక్షన్ బ్యానర్‌లో తెరకెక్కుతోన్న లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘రవికుల రఘురామ’. శ్రీధర్ వర్మ సాగి నిర్మాణంలో.. ట్యాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. యువ హీరో గౌతమ్ సాగి, అందాల భామ దీప్సిక జంటగా నటిస్తున్నారు. ప్రేక్షకులకు ఓ మంచి సినిమా ఇవ్వాలనే సంకల్పంతో దర్శకనిర్మాతలు ఈ సినిమా కోసం కష్టపడుతున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ప్రాణాలు’ అంటూ సాగే పాటను డైరెక్టర్ రాధాకృష్ణ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.

Ravikula Raghurama Movie Song Launch Event

పాజిటివ్ వైబ్ ప్రొడక్షన్ బ్యానర్‌లో తెరకెక్కుతోన్న లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘రవికుల రఘురామ’ (Ravikula Raghurama). శ్రీధర్ వర్మ సాగి నిర్మాణంలో.. ట్యాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ కానూరి (Chandrashekar Kanuri) దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. యువ హీరో గౌతమ్ సాగి, అందాల భామ దీప్సిక జంటగా నటిస్తున్నారు. ప్రేక్షకులకు ఓ మంచి సినిమా ఇవ్వాలనే సంకల్పంతో దర్శకనిర్మాతలు ఈ సినిమా కోసం కష్టపడుతున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ప్రాణాలే’ అంటూ సాగే పాటను డైరెక్టర్ రాధాకృష్ణ (Director Radha Krishna) చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.

పాటను విడుదల చేసిన అనంతరం రాధాకృష్ణ మాట్లాడుతూ.. ‘ప్రాణాలే’ సాంగ్ వింటుంటే చాలా ప్రామిసింగ్‌గా అనిపిస్తోంది. లిరిక్స్, ట్యూన్ ఎంతో అందంగా వినసొంపుగా ఉన్నాయి. ఈ పాట ఆకట్టుకోవడమే కాదు సినిమాపై కూడా ఆసక్తిని పెంచేలా ఉంది. ఈ సాంగ్ విన్న తర్వాత ‘రవికుల రఘురామ’ చిత్ర రిలీజ్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తారని చెప్పడంలో సందేహం లేదు. మార్చి 15న విడుదల కాబోతున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటూ, యూనిట్‌కు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. (#RavikulaRaghurama)


దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. పాటను విడుదల చేసిన దర్శకులు రాధాకృష్ణగారికి మా టీమ్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా పనిచేస్తున్న సుకుమార్ పమ్మి అద్భుతమైన పాటలు అందిస్తున్నారు. తన సంగీతాన్ని ఈ చిత్రానికి ఒక సోల్‌గా మార్చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘చందమామే’ పాటకు చాలా మంచి స్పందన వచ్చింది. ఇప్పుడీ ‘ప్రాణాలే’ పాట (Pranale Song) కూడా శ్రోతలను అలరిస్తుందని ఆశిస్తున్నాము. సినిమాను మార్చి 15న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

====================

*Keerthi: మహిళలపై అరాచకాలు జరుగుతుంటే దేవుడెక్కడ? అంటూ నటి సంచలన వ్యాఖ్యలు

*******************************

*Odela 2: శివశక్తిగా తమన్నా భాటియా.. ఫస్ట్ లుక్ ఇదే..

****************************

*Usha Parinayam: దుబాయ్‌లో అయింది.. ఇప్పుడు కాశ్మీర్‌లో..

*******************************

*Gaami Movie Review: విశ్వక్ సేన్ ‘గామి’ సినిమా ఎలా ఉందంటే...

****************************

Updated Date - Mar 09 , 2024 | 05:50 PM