M4M: సంగీత దర్శకుడిపై చిత్ర దర్శకుడు ప్రశంసలు

ABN, Publish Date - Aug 21 , 2024 | 06:02 PM

‘మల్లెపువ్వు, మెంటల్ కృష్ణ, కలవరమాయే మదిలో’ వంటి చిత్రాలను నిర్మించిన మోహన్ వడ్లపట్ల దర్శకుడిగా రూపొందిస్తున్న చిత్రం M4M (‘మోటివ్ ఫర్ మర్డర్’). సంబీత్ ఆచార్య, జో శర్మ జంటగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని మ్యూజిక్‌పై స్పెష‌ల్ వీడియోను రిలీజ్ చేశారు దర్శకుడు మోహన్ వడ్లపట్ల. వసంత్ ఇసైపెట్టై అందించిన ఈ సినిమా మ్యూజిక్ చాలా బాగుంద‌ని ఆయన ఇందులో ప్ర‌శంస‌లు కురిపించారు.

Music Director Vasanth Isaipettai and Director Mohan Vadlapatla

‘మల్లెపువ్వు, మెంటల్ కృష్ణ, కలవరమాయే మదిలో’ వంటి చిత్రాలను నిర్మించిన మోహన్ వడ్లపట్ల (Mohan Vadlapatla) దర్శకుడిగా రూపొందిస్తున్న చిత్రం M4M (‘మోటివ్ ఫర్ మర్డర్’). సంబీత్ ఆచార్య (Sambeet Acharya), జో శర్మ జంటగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని మ్యూజిక్‌పై స్పెష‌ల్ వీడియోను రిలీజ్ చేశారు దర్శకుడు మోహన్ వడ్లపట్ల. వసంత్ ఇసైపెట్టై (Music Director Vasanth Isaipettai) అందించిన ఈ సినిమా మ్యూజిక్ చాలా బాగుంద‌ని ఆయన ఇందులో ప్ర‌శంస‌లు కురిపించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా నెక్ట్స్ లెవ‌ల్‌లో ఉంద‌న్నారు. ఇలాంటి ట్యూన్స్ ఇప్ప‌టి వ‌ర‌కు ప్రేక్షకులు విని ఉండ‌ర‌ని కచ్చితంగా చెప్పగలనని ఆయన అన్నారు. వసంత్ ఇసైపెట్టై‌ని మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు.

Also Read- Sanam Shetty: తమిళ చిత్ర పరిశ్రమలోనూ క్యాస్టింగ్ కౌచ్.. ఆఫర్ల కోసం శరీరాన్ని అమ్ముకోను

ఈ సంద‌ర్భంగా త‌న‌కు ఇంత పెద్ద అవ‌కాశం ఇచ్చిన మోహన్ వడ్లపట్లకు మ్యూజిక్ డైరెక్ట‌ర్ వసంత్ ఇసైపెట్టై కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. త‌న ప్ర‌య‌త్నానికి స‌హ‌క‌రించినందుకు రుణ‌ప‌డి ఉంటాన‌ని అన్నారు. ఈ సినిమా మ్యూజిక్ ల‌వ‌ర్స్‌కి బాగా న‌చ్చుతుంద‌ని తెలిపారు. తెలుగు, హిందీ, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌లయాళం.. ఇలా ఐదు భాషలలో విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. తాజాగా ఐదు భాషలలో రిలీజ్ అయిన టీజర్స్‌కు వసంత్ ఇసైపెట్టై‌ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందరినీ ఆకట్టుకుని అంచనాలు పెంచేసింది. ప్ర‌స్తుతం వసంత్ ఇసైపెట్టై నేతృత్వంలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తుది మెరుగులు దిద్దుకుంటోంది. (M4M Movie Latest Update)


షూటింగ్ పూర్తి చేసుకున్న M4M (‘మోటివ్ ఫర్ మర్డర్’) ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఒడిశా సూపర్ స్టార్ సంభీత్ ఆచార్య, అమెరికన్ యాక్ట్రస్ జో శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం త్వ‌ర‌లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మోహన్ మీడియా క్రియేషన్స్, జో శర్మ మెక్విన్ గ్రూప్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మోహన్ వడ్లపట్ల, జో శర్మ (Jo Sharma), రాహుల్ అడబాల (Rahul Adabala) కథను అందించారు.

Read Latest Cinema News

Updated Date - Aug 21 , 2024 | 06:03 PM