మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Record Break: పెద్ద హీరోలతో కాకుండా.. కొత్త వాళ్లతో మంచి కంటెంట్ సినిమా తీశాం

ABN, Publish Date - Mar 07 , 2024 | 03:11 PM

నిహార్ కపూర్ , నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం రికార్డ్ బ్రేక్. చదలవాడ శ్రీనివాసరావు దర్శక‌త్వం వ‌హించారు.ఇటీవ‌ల‌ ఈ సినిమా ప్రీమియర్ షోల కు వస్తున్న రెస్పాన్స్ చూసి చదలవాడ శ్రీనివాసరావు గారు మీడియాతో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

RECORD BREAK

నిహార్ కపూర్ (Nihar kappor), నాగార్జున (Nagarjuna), సత్య కృష్ణ(Sathya Krishnan), టి. ప్రసన్నకుమార్, రగ్ధా ఇఫ్తాకర్ (Raghda Iftekhar), సంజన, శాంతి తివారి, సోనియా, కాశీ విశ్వనాథ్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం రికార్డ్ బ్రేక్ (Record Break). శ్రీతిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ (Sri Tirumala Tirupathi Venkateshwara Films (STTV Films)) బ్యానర్ పై చదలవాడ పద్మావతి (Chadalavada Padmavati) నిర్మాతగా చదలవాడ శ్రీనివాసరావు (Chadalavada Srinivasa Rao) దర్శకునిగా ఈ సినిమాని చాలా గ్రాండ్ గా నిర్మించారు. ఈ సినిమాకి కథ అంగిరెడ్డి శ్రీనివాస్ (Agireddy Srinivas) అందించగా డీఓపీగా కంతేటి శంకర్ మరియు సాబు వర్గీస్ మ్యూజిక్ అందించారు. అయితే ఈ రికార్డ్ బ్రేక్ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 8న విడుదలవుతున్న క్ర‌మంలో వారం ముందే ఈ సినిమా ప్రీమియర్ షోలు మీడియాకు ప్రదర్శించి ఓ రికార్డు నెల‌కొల్పారు. అయితే ప్రీమియర్ షోలకు వస్తున్న రెస్పాన్స్ చూసి చదలవాడ శ్రీనివాసరావు గారు మీడియాతో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా చదలవాడ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ : ఎంతోకాలంగా నాతో ప్రయాణం చేస్తున్న నా మిత్రుడు నలమాటి వెంకటకృష్ణారావు ఈ సినిమా ప్రీమియర్ షోలకి వచ్చి కొబ్బరికాయ కొట్టి తన సపోర్ట్ ని నాకు అందించడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఎప్పుడూ ఒక పాజిటివ్ వైబ్ తో ఉంటారు. ఆయన చేతుల మీదగా ఈ ప్రీమియర్ షోల్డర్ స్టార్ట్ చేయించాలని నేను ఎప్పటినుంచో అనుకుంటున్నా. ఆయన ఎంతో బిజీగా ఉన్న రాజమండ్రి నుంచి నాకోసం వచ్చి ఈ ప్రీమియర్ షోలు ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇది తెలుగు వాళ్లకు, రైతులకు సంబంధించిన అదేవిధంగా ప్రతి భారతీయుడు చూసి గర్వించదగ్గ సినిమా. అదేవిధంగా నేను అనుకున్నట్టుగా నా స్నేహితుడు పంచ కట్టుతో ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి ప్రీమియర్ షోలు స్టార్ట్ చేయడం ఇప్పటివరకు ఎక్కడా జరగలేదన్నారు.

ఇదిలాఉండ‌గా.. పెద్ద హీరోలతో కాకుండా కొత్త వాళ్లతో ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా తీయడం చాలా గర్వంగా అనిపిస్తోంది. నేను పిలవగానే ఈ ప్రీమియర్ షోలకు వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న దర్శకులు విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad), జయసుధ ((Jayasudha), ఆర్ నారాయణ మూర్తి, రైటర్ చిన్ని కృష్ణ, దర్శకులు చంద్ర మహేష్, సునీల్ రెడ్డి అంద‌రికి నా కృతజ్ఞతలని అన్నారు. వారు ఈ సినిమా చూసి తల్లి సెంటిమెంట్, దేశభక్తి గురించి మెచ్చుకోవడం చాలా ఆనందంగా అనిపించిందన్నారు. చిన్న సినిమాలు బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. మా నటీనటుల్ని, టెక్నీషియన్స్ ని ఈ సినిమాని ప్రేక్షకుల ఆదరించి ఆశీర్వదించాలని మంచి విజయం చేకూర్చాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అన్నారు.

దర్శకుడు,ర‌చ‌యిత‌ విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) మాట్లాడుతూ.. రికార్డ్ బ్రేక్ చాలా మంచి సినిమా అని, టెక్నికల్ వాల్యూస్, ఆర్ఆర్ చాలా బాగున్నాయన్నారు. ఇది ఒక కొత్త అటెంప్ట్ అని, చదలవాడ శ్రీనివాసరావు గారి ధైర్యానికి మెచ్చుకోవచ్చన్నారు. ఇది కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చే సినిమా అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అన్నారు. నటుడు ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ.. తల్లి సెంటిమెంట్ ని చాలా బాగా చూపించారని, మన పుట్టుక మొదలుకొని మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన మట్టికిచ్చే వ్యాల్యూ ఏంటి అన్న అంశాలను చాలా బాగా చూపించారన్నారు. మన బలం ఏంటి మనం తినే తిండి ఏంటి మనిషి ఎలా ఉండాలని విలువలు చాలా బాగా చూపించారన్నారు. ఈ రికార్డ్ బ్రేక్ మూవీ ఖ‌చ్చితంగా రికార్డులు బ్రేక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నారు.


న‌టి జయసుధ (Jayasudha) మాట్లాడుతూ.. ఈ సినిమాలో నిహార్ నటించిన చాలా ఆనందంగా ఉందని, నా కొడుకు చేశాడని కాకుండా చెప్తున్నా ఒక మంచి సినిమా చేసి ప్రేక్షకులకు ముందు తీసుకొస్తున్నారని, శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ పై నేను చాలా సినిమాల్లో నటించానని.. ఈ బ్యానర్ తో చదలవాడ శ్రీనివాసరావు గారితో చాలా మంచి అనుబంధం ఉందన్నారు. ఇప్పుడు ఈ బ్యానర్ నుంచి ఈ రికార్డ్ బ్రేక్ మూవీ రావడం చాలా ఆనందంగా అనిపిస్తోందని, సినిమాలో చాలా మంచి విలువలు ఉన్నాయని కచ్చితంగా అందరూ చూసి మెచ్చుకునే సినిమా అవుతుందన్నారు.

రామ్, మాతో మాట్లాడుతూ, ఉపాసన గుర్తింపు తన సెలబ్రిటీ స్టేటస్‌తో మాత్రమే ముడిపడి లేదని నొక్కి చెప్పాడు, “ఉపాసన ఖచ్చితంగా స్టార్ భార్య మాత్రమే కాదు, ఆమె అనేక పాత్రలతో ఆ లేబుల్‌ను అధిగమిస్తుంది. ఆమె విజయం కీర్తి యొక్క మెరుస్తున్న రంగాలకు మించి విస్తరించింది. ఇంట్లో మా కుటుంబంతో ఉన్నా లేదా ఆమె దాతృత్వ ప్రాజెక్ట్‌లకు గణనీయమైన సహకారం అందించినా, ఆమె అచంచలమైన నిబద్ధత మరియు లోతుగా పాతుకుపోయిన కుటుంబ విలువల కారణంగా అన్ని పాత్రలలో రాణిస్తుంది. ఉపాసన తన కుటుంబ వారసత్వాన్ని అందంగా ముందుకు తీసుకువెళ్లింది. నా భార్య కాకుండా, ఆమె నా రాయి మరియు మమ్మల్ని కలిసి ఉంచే శక్తి. ఆమె చేసే పనిని నేను నిజంగా ఎప్పుడూ పునరావృతం చేయలేను మరియు ఆమె నిజంగా తన స్వంత అద్భుతమైన మార్గాన్ని చెక్కింది.

Updated Date - Mar 07 , 2024 | 03:11 PM