జాసన్ సంజయ్ దర్శకత్వంలో..
ABN, Publish Date - Nov 30 , 2024 | 05:14 AM
కోలివుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకత్వంలో సినిమా తీయబోతున్నట్లు ‘లైకా’ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోగా సందీప్ కిషన్
కోలివుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకత్వంలో సినిమా తీయబోతున్నట్లు ‘లైకా’ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోగా సందీప్ కిషన్ నటించబోతున్నారని ప్రకటిస్తూ మూవీ పోస్టర్‌ను చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా విడుదల చేసింది. ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్ హెడ్ జికెఎం తమిళ్ కుమరన్ మాట్లాడుతూ ‘జాసన్ సంజయ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. ఈ కథలో పాన్ ఇండియా దృష్టిని ఆకర్షించే ప్రధానమైన పాయింట్ ఉంది. తమన్ సంగీతం అందించబోతున్నారు. జనవరిలో షూటింగ్ ప్రారభించబోతున్నాం’ అని తెలపారు.