పొరపొచ్చాలతోనే పేరు తొలగింపా?

ABN, Publish Date - Nov 29 , 2024 | 06:08 AM

ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌, అభిషేక్‌ బచ్చన్‌ దంపతులు విడిపోతున్నారంటూ కొన్నాళ్లుగా జరుగుతున్న ఊహాగానాలకు మరోసారి రెక్కలొచ్చాయి. ఈ మధ్య ఐశ్వర్యారాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌ కలసి కనిపించడం...

ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌, అభిషేక్‌ బచ్చన్‌ దంపతులు విడిపోతున్నారంటూ కొన్నాళ్లుగా జరుగుతున్న ఊహాగానాలకు మరోసారి రెక్కలొచ్చాయి. ఈ మధ్య ఐశ్వర్యారాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌ కలసి కనిపించడం లేదు అని అంతా చర్చించుకుంటున్న తరుణంలో ఇప్పుడు ఐశ్వర్యారాయ్‌ పేరులో ‘బచ్చన్‌’ అనే వారి ఇంటిపేరు కనిపించడం లేదు. ఇటీవలే దుబాయ్‌లో జరిగిన గ్లోబల్‌ విమెన్స్‌ ఫోరమ్‌లో ఐశ్వర్యారాయ్‌ పాల్గొన్నారు. అక్కడ మహిళా సాధికారతపై ఆమె చేసిన ప్రసంగానికి మంచి స్పందన వచ్చింది. అయితే ఆమె వేదికపై మాట్లాడుతున్న సమయంలో వెనుక తెరపై ప్రదర్శించిన స్లైడ్‌లో నిర్వాహకులు ‘ఐశ్వర్యారాయ్‌ - అంతర్జాతీయ నటి’ అని ఆమె పరిచయాన్ని క్లుప్తంగా పేర్కొన్నారు. ఐశ్వర్య పేరు చివర బచ్చన్‌ అనే ఇంటిపేరు లేకపోవడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. దాంతో నెటిజన్లు ఆ వీడియోను వైరల్‌ చేస్తున్నారు. ఐశ్వర్య, అభిషేక్‌ మధ్య పొరపొచ్చాలు ఉన్నాయి,


వారు విడిపోతున్నారు కాబట్టే ఆమె తన పేరులోని బచ్చన్‌ను తొలగించారనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. అయితే బచ్చన్‌ పదాన్ని తొలగించడానికి నిర్వాహకుల పొరపాటు కారణమా, లేదా ఐశ్వర్య సూచన మేరకే అలా చేశారా అనేది తెలియదు. తన కొడుకు అభిషేక్‌బచ్చన్‌, కోడలు ఐశ్వర్యారాయ్‌ విడిపోతున్నారంటూ మీడియాలో పదేపదే జరుగుతున్న ప్రచారంపై ఇటీవలే అమితాబ్‌ బచ్చన్‌ అసహనం వ్యక్తం చేశారు. అందులో నిజం లేదని తెలిపారు.

Updated Date - Nov 29 , 2024 | 06:08 AM