Martin: ధృవ్ సర్జా ‘మార్టిన్’ విడుదల ఎప్పుడంటే..

ABN, Publish Date - Sep 18 , 2024 | 10:44 PM

ధృవ స‌ర్జా టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘మార్టిన్’. ఎ.పి.అర్జున్ ద‌ర్శ‌క‌త్వంలో వాస‌వీ ఎంట‌ర్‌ప్రైజెస్‌, ఉద‌య్ కె.మెహ‌తా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై ఉద‌య్ కె.మెహ‌తా, సూర‌జ్ ఉద‌య్ మెహ‌తా ఈ భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ను నిర్మించారు. ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.

Martin Movie Still

ధృవ స‌ర్జా (Dhruva Sarja) టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘మార్టిన్’ (Martin). ఎ.పి.అర్జున్ ద‌ర్శ‌క‌త్వంలో వాస‌వీ ఎంట‌ర్‌ప్రైజెస్‌, ఉద‌య్ కె.మెహ‌తా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై ఉద‌య్ కె.మెహ‌తా, సూర‌జ్ ఉద‌య్ మెహ‌తా ఈ భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ను నిర్మించారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ చిత్ర ట్రైల‌ర్‌ మంచి స్పందనను రాబట్టుకుని సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ఈ ట్రైలర్ చూస్తుంటే ఇండియన్ స్క్రీన్‌పై ఇది వరకెన్నడూ చూడని యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా ‘మార్టిన్’ నిలిచే కంటెంట్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ట్రైలర్‌లో ధృవ్ సర్జా లుక్స్, యాక్షన్ సీక్వెన్స్, చివర్లో చెప్పిన డైలాగ్ అన్నీ కూడా వావ్ అనేలా ఉన్నాయి. (Martin Release Date)

Also Read- Jani Master: జానీ మాస్టర్‌పై పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు.. మ్యాటర్ సీరియస్


ప్ర‌ముఖ న‌టుడు, ద‌ర్శ‌కుడు అయిన యాక్ష‌న్ కింగ్ అర్జున్ (Action King Arjun) ఈ చిత్రానికి క‌థ‌ను అందించ‌టం విశేషం. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ పాట‌ల‌కు సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేష‌న్ ర‌వి బ‌స్రూర్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించారు. ఈ ట్రైలర్‌లో ఆర్ఆర్‌ను వింటే.. రవి బస్రూర్ ఈ చిత్రాన్ని మరో స్థాయిలో నిలబెట్టేస్తాడని అర్థం అవుతోంది. సత్య హెగ్డే విజువల్స్ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఉన్నాయి. అక్టోబర్ 11న ఈ చిత్రం మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ (Mythri Movie Distributors) ఎల్ఎల్‌పి ద్వారా నైజాంలో.. ఏపీ, సీడెడ్‌లో ఎంఎస్ ఫిల్మ్స్ ద్వారా రిలీజ్ కానుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టింది.

Also Read- Poonam Kaur: అప్పట్లో నా మాట పట్టించుకోలేదు.. త్రివిక్రమ్ పై పూనమ్‌ సంచలన వ్యాఖ్యలు

Read Latest Cinema News

Updated Date - Sep 18 , 2024 | 10:44 PM