నయనతార దంపతులపై ధనుష్‌ దావా

ABN, Publish Date - Nov 28 , 2024 | 05:55 AM

హీరోయిన్‌ నయనతార, ఆమె భర్త, సినీ దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌లపై తమిళ హీరో ధనుష్‌ కోర్టులో దావా వేశారు. తాను నిర్మించిన ‘నానుమ్‌ రౌడీ దాన్‌’

హీరోయిన్‌ నయనతార, ఆమె భర్త, సినీ దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌లపై తమిళ హీరో ధనుష్‌ కోర్టులో దావా వేశారు. తాను నిర్మించిన ‘నానుమ్‌ రౌడీ దాన్‌’ చిత్రంలోని విజువల్స్‌ను ‘నయనతార: బియాండ్‌ ద ఫేరీ టేల్‌’ అనే డాక్యుమెంటరీలో తన అనుమతి లేకుండా వాడుకున్నారని ధనుష్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిని పరిశీలించిన మద్రాస్‌ హైకోర్టువిచారణకు స్వీకరించింది. ఈ డాక్యుమెంటరీ టీజర్‌లో 3 సెకండ్ల పాటు ‘నానుమ్‌ రౌడీ దాన్‌’ చిత్రం విజువల్స్‌ను వాడినందుకు రూ.10 కోట్లు డిమాండ్‌ చేస్తూ ధనుష్‌ నయనతారకు నోటీసు పంపించారు. దీంతో ఆగ్రహించిన నయనతార.. ధనుష్‌ వైఖరిని తప్పుబడుతూ బహిరంగ లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ధనుష్‌ హైకోర్టును ఆశ్రయించారు.

స్ఫూర్తిదాయకంగా అనిపించలేదు

‘‘నేను ‘నయనతార: బియాండ్‌ ద ఫేరీ టేల్‌’ను చూశా. స్ఫూర్తిదాయకమైన, ఆకట్టుకునే అంశాలు ఏమీ ఇందులో లేవు’ అని డాక్యుమెంటరీపై ప్రముఖ రచయిత్రి శోభా దే అన్నారు. ‘నాకు నయనతార గురించి తెలీదు. ఆమె గురించి తెలుసుకోవాలని ఽధైర్యం చేసి 45 నిమిషాల పాటూ చూశాను. వివాహాన్ని ఇలా వ్యాపార ప్రయోజనాలకు వాడుకోవడం మంచి పద్ధతి కాదు. ఇది చూసి అందరూ వీరినే ఫాలో అవుతారు’’ అని పేర్కొన్నారు.

చెన్నై (ఆంధ్రజ్యోతి)

Updated Date - Nov 28 , 2024 | 05:59 AM