అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మురేపుతున్న దేవర
ABN, Publish Date - Sep 10 , 2024 | 03:44 AM
జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘దేవర’. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా, సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు....
జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘దేవర’. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా, సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ ఇందులో కథానాయికగా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ ‘ఫియర్’ సినిమాపై అంచనాలను తారాస్థాయిలో పెంచాయి. ‘దేవర పార్ట్ 1’ ఈ నెల 27న విడుదలవుతోంది. ఈ సినిమా రిలీజ్ కాకముందే బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. నార్త్ అమెరికాలో ఈ చిత్రం ప్రీమియర్ షో టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయిపోయాయి. ఇప్పటికే 8 లక్షల డాలర్లను (25 వేల టిక్కెట్లు) అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో వసూలు చేసి దుమ్మురేపుతోంది. ‘దేవర’ చిత్రం ట్రైలర్ ఈ రోజు విడుదల కానుంది.