Devaki Nandana Vasudeva: మంచి, చెడుల మధ్య యుద్ధం.. ట్రైలర్ ఎలా ఉందంటే..
ABN, Publish Date - Nov 12 , 2024 | 06:21 PM
అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో, లలితాంబిక ప్రొడక్షన్స్ పతాకంపై సోమినేని బాలకృష్ణ నిర్మించిన చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. నవంబర్ 22న విడుదల కాబోతోన్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన వేడుకలో విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉందంటే..
తొలి సినిమా ‘హీరో’తో ఆకట్టుకున్న యంగ్ హీరో అశోక్ గల్లా తన సెకెండ్ మూవీ ‘దేవకీ నందన వాసుదేవ’తో వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ‘గుణ 369’ దర్శకుడు అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో, లలితాంబిక ప్రొడక్షన్స్ పతాకంపై సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు. మంగళవారం రానా దగ్గుబాటి, సందీప్ కిషన్ కలిసి ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేసి అశోక్ గల్లా అండ్ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ట్రైలర్ ఎలా ఉందంటే..
Also Read-Krish weds Priti: సైలెంట్‌గా రెండో పెళ్లి చేసుకున్న క్రిష్.. పెళ్లి ఫొటోలు వైరల్
సుదర్శన చక్రాన్ని కలిగి ఉన్న భూమిపై ఉన్న ఏకైక వాసుదేవ విగ్రహం గురించి వివరిస్తూ పవర్ ఫుల్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ మొదలైంది. అశోక్ గల్లా తన యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో ఇంటెన్స్ ఫైట్ సీన్‌తో పరిచయమయ్యారు. ఈ సంవత్సరం అతని జాతకంలో ప్రమాదం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని అతని తల్లి హెచ్చరిస్తుంది. అశోక్, మానస మధ్య వచ్చే సన్నివేశాలు కథకు రొమాన్స్ టచ్ ఇచ్చాయి. మరొక వైపు తన సొంత మేనల్లుడు, తన సోదరి మూడవ కొడుకు నుండి ప్రాణహాని ఎదుర్కునేలా చెబుతూ విలన్‌ని రివీల్ చేశారు. మిగిలిన కథనం మంచి, చెడుల మధ్య యుద్ధంగా ఎపిక్ క్లాస్‌ని సెట్ చేసింది. శ్రీ కృష్ణ భగవానుడి శక్తివంతమైన దర్శనాన్ని అందించే ఆధ్యాత్మిక టచ్‌తో ట్రైలర్‌ని ముగించారు. ప్రశాంత్ వర్మ అందించిన గ్రిప్పింగ్ స్టోరీని కమర్షియల్ ఫార్మెట్‌లో ప్రజెంట్ చేశారు అర్జున్ జంధ్యాల. సాయిమాధవ్ బుర్రా రాసిన పవర్ ఫుల్ డైలాగ్స్ మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా ఉన్నాయి. అశోక్ గల్లా తన పాత్రలో చూపించిన ట్రాన్స్ ఫర్మెషన్, అతని కమాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రత్యేకంగా ఉంది. వారణాసి మానస, అశోక్ లవ్ స్టోరీ కూడా సినిమాపై ఇంట్రస్ట్‌ని కలగజేస్తోంది. దేవదత్తా గజానన్ నాగే మెయిన్ విలన్‌గా అద్భుతమైన నటనను ప్రదర్శించారు. టెక్నికల్‌గా కూడా ఈ సినిమా హై స్టాండర్డ్స్‌లో ఉండబోతుందనేలా ఈ ట్రైలర్ హింట్ ఇచ్చేసింది. నవంబర్ 22న థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైన ఈ సినిమా థియేట్రికల్ హక్కులను శంకర్ పిక్చర్స్ సొంతం చేసుకుంది.
ఫస్ట్ టైం ప్రశాంత్ వర్మ పేరు విన్నా..
ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో గల్లా జయదేవ్ మాట్లాడుతూ.. రానా, సందీప్‌లకు థాంక్యూ. రానా బిగినింగ్ నుంచి అశోక్‌కు ఎంతో సపోర్ట్‌గా ఉంటున్నారు. ప్రశాంత్ వర్మ ఫస్ట్ టైం వచ్చి ఈ కథ చెప్పినప్పుడు అశోక్‌కి చాలా నచ్చింది. అప్పుడే ఫస్ట్ టైం నేను ప్రశాంత్ వర్మ పేరు విన్నాను. తర్వాత ఆయన కెరీర్ చూస్తున్నప్పుడు, ‘హనుమాన్’ లాంటి ఒక పెద్ద సక్సెస్ వచ్చినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ అందించిన కథ చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. అంత మంచి అవకాశం ఇచ్చిన ప్రశాంత్ వర్మకి థాంక్యూ సో మచ్. డైరెక్టర్ అర్జున్, ప్రొడ్యూసర్ బాలకృష్ణతో చాలా ప్యాషన్‌తో ఈ సినిమా రూపొందించారు. వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేశారో నేను చూశాను. ఒక ఛాలెంజ్‌గా తీసుకొని ఈ సినిమా చేశారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. అశోక్ సెకండ్ సినిమా ఇది. ఫస్ట్ సినిమా కొవిడ్ సమయంలో రావడం కొంచెం ప్రాబ్లం అయింది. అయినా ఆ సినిమాకి చాలా మంచి ప్రశంసలు వచ్చాయి. తన పెర్ఫార్మన్స్‌ని అందరూ మెచ్చుకున్నారు. ఫాదర్‌గా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమాతో తను నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తారని ఆశిస్తున్నాను. అశోక్, మానస టీమ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా టీమ్ అందర్నీ కొత్త హైట్స్‌కి తీసుకెళ్తుందని భావిస్తున్నాను. అందరికీ గుడ్ లక్ అని చెప్పుకొచ్చారు.