Devaki Nandana Vasudeva: ‘దేవకీ నందన వాసుదేవ’ ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?

ABN , Publish Date - Apr 30 , 2024 | 06:54 PM

‘హీరో’ చిత్రంతో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా ప్రస్తుతం ‘గుణ 369’ ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ‘దేవకీ నందన వాసుదేవ’ అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. లలితాంబిక ప్రొడక్షన్స్‌లో ప్రొడక్షన్‌ నెం. 1గా ఎన్‌ఆర్‌ఐ (ఫిలిం డిస్ట్రిబ్యూటర్‌) సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ సింగిల్ అప్‌డేట్‌ని మేకర్స్ వదిలారు.

Devaki Nandana Vasudeva: ‘దేవకీ నందన వాసుదేవ’ ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?
Devaki Nandana Vasudeva Movie Still

‘హీరో’ చిత్రంతో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla) ప్రస్తుతం ‘గుణ 369’ (Guna 369) ఫేమ్ అర్జున్ జంధ్యాల (Arjun Jandyala) దర్శకత్వంలో ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva) అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ‘హనుమాన్’ ఫేమ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఈ చిత్రానికి కథ అందించగా.. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా (Sai Madhav Burra) డైలాగ్స్ రాస్తున్నారు. లలితాంబిక ప్రొడక్షన్స్‌లో ప్రొడక్షన్‌ నెం. 1గా ఎన్‌ఆర్‌ఐ (ఫిలిం డిస్ట్రిబ్యూటర్‌) సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ సింగిల్ అప్‌డేట్‌ని మేకర్స్ వదిలారు.

*Allu Ramalingaiah: అల్లుకి హాస్యనటుడిగా అవార్డు ఎప్పుడు వచ్చిందో తెలుసా?

గతంలో ఈ సినిమాలోని హీరో పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన టీజర్‌ మంచి స్పందనను రాబట్టుకుని.. సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌ని మేకర్స్ స్టార్ చేసి.. ఫస్ట్ సింగిల్ ‘ఏమయ్యిందే’ (Yeamayyinde) ప్రోమోను కూడా విడుదల చేశారు. ఇటీవలి కాలంలో అనేక చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించిన సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo) ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


Manasa.jpg

‘ఏమయ్యిందే’ అంటూ సాగిన ఈ పాట అశోక్ గల్లా తన లవ్ వారణాసి (Varanasi Manasa) మానస పట్ల ఆరాధనని చూపుతోంది. ఈ పాటలో అశోక్ గల్లా ఆనందంగా కనిపించగా, వారణాసి మానస అందంగా ఉంది. వీరి జోడి తెరపై ఆకర్షణీయంగా కనిపించింది. పూర్తి సాంగ్ మే3 న విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. గ్రాండ్ ప్రొడక్షన్ డిజైన్‌తో భారీ ఎత్తున తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల డీవోపీగా పని చేస్తున్నారు. తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్ ఈ సినిమా నుంచి రానున్నాయని మేకర్స్ తెలిపారు.

Read Latest Cinema News

Updated Date - Apr 30 , 2024 | 06:54 PM