అశోక్‌ను నిలబెట్టే సినిమా ఇది

ABN, Publish Date - Nov 21 , 2024 | 06:18 AM

‘హీరో’ ఫేమ్‌ అశోక్‌ గల్లా, ‘మిస్‌ ఇండియా’ టైటిల్‌ విజేత మానస వారణాసి జంటగా నటించిన చిత్రం ‘దేవకి నందన వాసుదేవ’. ప్రశాంత్‌ వర్మ కథ

‘హీరో’ ఫేమ్‌ అశోక్‌ గల్లా, ‘మిస్‌ ఇండియా’ టైటిల్‌ విజేత మానస వారణాసి జంటగా నటించిన చిత్రం ‘దేవకి నందన వాసుదేవ’. ప్రశాంత్‌ వర్మ కథ అందించగా.. అర్జున్‌ జంధ్యాల దర్శకత్వంలో సోమినేని బాలకృష్ణ నిర్మించారు. ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా మేకర్స్‌ ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘‘ఈ సినిమా హీరో అశోక్‌ను ఇండస్ట్రీలో నిలబెడుతుంది. డైరెక్టర్‌కి అర్జున్‌ జంధ్యాలకి, అశోక్‌కు సింక్‌ చాలా బాగుంది. ఈ సినిమా పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు. ‘‘అశోక్‌ మంచి నటుడు. ఆయన ప్రోత్సాహం వల్లే సినిమా అవుట్‌పుట్‌ అద్భుతంగా వచ్చింది. ఈ సినిమాకు సపోర్ట్‌ చేసినవారందరికీ కృతజ్ఞతలు’’ అని అన్నారు. ‘‘సినిమా అంచనాలను మించి ఉంటుంది’’ అని నిర్మాత సోమినేని బాలకృష్ణ తెలిపారు.

Updated Date - Nov 21 , 2024 | 06:18 AM