దీపికకు వరం.. ఐశ్వర్యకు కలవరం

ABN, Publish Date - Nov 12 , 2024 | 06:22 AM

కొన్ని కొన్ని విషయాల గురించి వింటుంటే తమాషాగా అనిపిస్తుంటుంది. సినిమాల్లో మొదట ఒక తారను అనుకుని చివరికి మరొకరిని తీసుకోవడం అప్పుడప్పుడు జరుగుతుంటుంది. ఇలాంటి మార్పుల వల్ల ఆయా తారల...

కొన్ని కొన్ని విషయాల గురించి వింటుంటే తమాషాగా అనిపిస్తుంటుంది. సినిమాల్లో మొదట ఒక తారను అనుకుని చివరికి మరొకరిని తీసుకోవడం అప్పుడప్పుడు జరుగుతుంటుంది. ఇలాంటి మార్పుల వల్ల ఆయా తారల కెరీర్‌ కీలకమైన మలుపు తిరిగిన సందర్భాలూ ఉన్నాయి. ఐశ్వర్య, దీపిక.. అందంలో, అభినయంలో సమ ఉజ్జీలే. ఐశ్వర్య చేయాల్సిన రెండు చిత్రాలు ‘బాజీరావు మస్తానీ’, ‘పద్మావత్‌’ చివరి క్షణంలో ఆమె చేజారి దీపికకు దక్కాయి. సల్మాన్‌ ఖాన్‌, ఐశ్వర్య జంటగా ‘బాజీరావు మస్తానీ’ చిత్రాన్ని తీయాలని దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ 2003లో ప్లాన్‌ చేశారు. అంతా సవ్యంగా జరుగుతుందనుకుంటున్న సమయంలో అప్పటివరకూ ప్రేమికులుగా ఉన్న సల్మాన్‌, ఐశ్వర్య బ్రేకప్‌ చెప్పేసుకుని విడిపోవడం, ఆ వార్త వైరల్‌ కావడంతో భన్సాలీ ముందే మేల్కొన్నారు. వీరిద్దరిని ఆయన వద్దనుకున్నారు. అప్పుడు హీరోయిన్‌గా దీపికను తీసకుకున్నారు. అలాగే అల్లాఉద్దీన్‌ ఖిల్జీగా షారుఖ్‌ఖాన్‌నీ, రాణి పద్మావతిగా ఐశ్వర్య బచ్చన్‌ని పెట్టి ‘‘పద్మావత్‌’ చిత్రాన్ని తీయాలని భన్సాలీ ప్లాన్‌ చేశారు.


కానీ ఒక నరహంతకుడి పాత్రను పోషించడానికి షారుఖ్‌ ఖాన్‌ ఆసక్తి చూపించకపోవడంతో షారుఖ్‌నే కాదు ఐశ్వర్యను కూడా మార్చేశారు భన్సాలీ. మళ్లీ ఆ అవకాశం దీపికకే దక్కింది. ‘బాజీరావు మస్తానీ’, ‘పద్మావత్‌’ చిత్రాలు ఒక్కొక్కటీ రూ 950 కోట్లు వసూలు చేయడంతో హీరోయిన్‌గా దీపిక జాతకమే మారిపోయింది.

Updated Date - Nov 12 , 2024 | 06:22 AM