నాన్నే నా హీరో
ABN, Publish Date - Sep 04 , 2024 | 03:24 AM
ఎనభైల దశకంలో బాలీవుడ్‌లో విలన్‌గా ఒక వెలుగు వెలిగిన శక్తి కపూర్ మంగళవారం తన 72వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నారు. ఎంతో మంది ఆయనకు అభినందనలు తెలిపారు కానీ...
ఎనభైల దశకంలో బాలీవుడ్‌లో విలన్‌గా ఒక వెలుగు వెలిగిన శక్తి కపూర్ మంగళవారం తన 72వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నారు. ఎంతో మంది ఆయనకు అభినందనలు తెలిపారు కానీ కుమార్తె శ్రద్ధా కపూర్ ఇచ్చిన పొగడ్త శక్తికపూర్‌కు ఎంతో శక్తినిచ్చింది. మరికొన్నేళ్ల పాటు జీవించాలనే ఉత్సాహాన్ని కలిగించింది. తండ్రితో దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ‘నాన్నే నా హీరో. తండ్రి అండదండలు ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలం’ అని కామెంట్ పెట్టింది శ్రద్ధా. ఆమె నటించిన ‘స్ర్తీ 2’ చిత్రం ఇప్పుడు వసూళ్ల పరంగా సంచలన రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది.