కొత్త ఒరవడి సృష్టిస్తుంది
ABN, Publish Date - Oct 17 , 2024 | 05:35 AM
అకిరా డ్రీమ్ క్రియేషన్స్ పతాకంపె రాజేష్ నాయుడు దర్శకత్వంలో యోగేష్, ఆకృతి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘త్రిముఖ’. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను హీరో సాయి దుర్గా తేజ్ ఆవిష్కరించి...
అకిరా డ్రీమ్ క్రియేషన్స్ పతాకంపె రాజేష్ నాయుడు దర్శకత్వంలో యోగేష్, ఆకృతి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘త్రిముఖ’. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను హీరో సాయి దుర్గా తేజ్ ఆవిష్కరించి మాట్లాడారు. ‘యోగేష్ మంచి పట్టుదల ఉన్న వ్యక్తి. ఈ చిత్రం డెఫినెట్‌గా కొత్త ఒరవడి సృష్టిస్తుంది’ అని అన్నారు. హీరో యోగేష్ మాట్లాడుతూ ‘నా మొదటి ప్రాజెక్ట్‌గా త్రిముఖలో నటించడం సంతోషంగా ఉంది. సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని చాలా నమ్మకంగా ఉంది’ అని అన్నారు.