క్రేజీగా రాంబో
ABN, Publish Date - Aug 05 , 2024 | 06:18 AM
షమ్ము హీరోగా హరీశ్ మధురెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘క్రేజీ రాంబో’. ర్యాప్‌రాక్ షకీల్ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాను ప్రారంభించి టైటిల్‌ను లాంచ్ చేశారు...
షమ్ము హీరోగా హరీశ్ మధురెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘క్రేజీ రాంబో’. ర్యాప్‌రాక్ షకీల్ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాను ప్రారంభించి టైటిల్‌ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో అశ్విన్‌బాబు మాట్లాడుతూ ‘‘టైటిల్ చాలా ఆసక్తికంగా ఉంది. సినిమా తప్పకుండా మంచి విజయం సాధించాలి’’ అని చెప్పారు. హీరో షమ్ము మాట్లాడుతూ ‘‘ఈ సినిమా కథ అద్భుతంగా ఉంటుంది’’ అని చెప్పారు. ‘‘చాలా మంచి కంటెంట్ ఉన్న చిత్రమిది’’ అని నిర్మాత ర్యాప్‌రాక్ షకీల్ అన్నారు.