NTR: యంగ్ చాప్ నందమూరి తారక రామారావు ఎంట్రీ మూవీ విశేషాలివే..

ABN, Publish Date - Aug 09 , 2024 | 07:51 PM

నందమూరి వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఆ ఫ్యామిలీ నాల్గవ తరం నటులు రెడీ అవుతున్నారు. లెజెండరీ నటుడు ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత జానకిరామ్ తనయుడు యంగ్ చాప్ నందమూరి తారక రామారావు నటుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. డైరెక్టర్ వైవిఎస్ చౌదరి రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌ని ‘న్యూ టాలెంట్ రోర్స్ @’ బ్యానర్‌పై యలమంచిలి గీత నిర్మించనున్నారు.

YVS Chowdary, NTR Movie Press Meet

తెలుగు చిత్రసీమలో విశిష్టమైన నందమూరి (Nandamuri) వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఆ ఫ్యామిలీ నాల్గవ తరం నటులు రెడీ అవుతున్నారు. లెజెండరీ నటుడు ఎన్టీఆర్ (NTR) ముని మనవడు, హరికృష్ణ (Harikrishna) మనవడు, దివంగత జానకిరామ్ (Janaki Ram) తనయుడు యంగ్ చాప్ నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Ramarao) నటుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి (YVS Chowdary) రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌ని ‘న్యూ టాలెంట్ రోర్స్ @’ (New Talent Rores @) బ్యానర్‌పై యలమంచిలి గీత (Yalamanchali Geetha) నిర్మించనున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే‌ని సెలబ్రేట్ చేసుకుంటూ శుక్రవారం.. మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన క్రేజీ అప్డేట్స్ అనౌన్స్ చేశారు. ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం, ఆస్కార్ విన్నింగ్ లిరిక్ రైటర్ చంద్రబోస్ ఈ సినిమాకి సాహిత్యం, స్టార్ డైలాగ్ రైటర్ సాయి మాధవ్‌ బుర్రా మాటలు ఈ సినిమాకు అందించబోతున్నట్లుగా వైవిఎస్ చౌదరి అధికారికంగా ప్రకటించారు. అలాగే ఈ సినిమాలో కథానాయికగా నటించబోయే హీరోయిన్ పేరుని కూడా ఆయన అనౌన్స్ చేశారు. ఈ చిత్రంలో తెలుగమ్మాయి వీణ రావ్ (Veenah Rao) హీరోయిన్‌గా సెలక్ట్ చేసినట్లుగా వైవిఎస్ చౌదరి తెలియజేశారు.

Also Read- NTR: ఎన్టీఆర్ పేరుతో మరో వారసుడు.. ఫ్యాన్స్‌లో కన్ఫ్యూజన్

ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో డైరెక్టర్ వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు చాలా ఆనందంగా వుంది. ఈ రోజు నాగ పంచమి. మొదటి శ్రావణ శుక్రవార శుభ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన మొదటి ఈవెంట్ మా ఆరాధ్య దైవం నందమూరి తారకరామారావు కుమారుడైన నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజును జరుపుకున్నాం. ఈ రోజు కార్యక్రమం సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే (Happy Birthday Super Star Mahesh Babu) సందర్భంగా జరుపుకోవడం చాలా ఆనందంగా వుంది. మహేష్ బాబు అంటే చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పటి నుంచి ఇష్టం. ఆయన నా మొదటి సినిమా చూడకుండానే నాకు ‘యువరాజు’ సినిమాకి అవకాశం ఇచ్చారు. అది ఆయన నామీద ఉంచిన నమ్మకం. ఆ నమ్మకం నాకు ఎంతో ఆత్మీయంగా అనిపించింది. ‘రాజకుమారుడు’ చేస్తున్న సమయంలోనే నా నిర్మాణ సంస్థ బొమ్మరిల్లుని స్థాపించాను. ‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమా విజయోత్సవ వేడుకకు ఆయనే స్వచ్ఛందంగా వచ్చి వెన్నంటి వున్నారు. ఆ సినిమా వందరోజుల వేడుక మహేష్ బాబు బర్త్ డే రోజైన ఆగస్ట్ 9నే గ్రాండ్‌గా చేశాను. అనుకోకుండా ఇదే రోజున ఈ వేడుక జరుపుకోవడం చాలా ఎమోషనల్‌గా వుంది.


ఈ వేడుకకు చాలా మెరపులు వున్నాయి. ఈ కథని నేను రాసుకున్నాను. దీనికి అర్థవంతమైన మాటలు రాయడానికి సమర్దవంతమైన మాటల రచయిత కావాలి. ‘కంచె’ సినిమా చూసినప్పుడే సాయి మాధవ్ బుర్రా (Sai Madhav Burra)తో పని చేయాలని అనుకున్నాను. ఆయన అన్ని సినిమాలకు న్యాయం చేశారు. ప్రతి సినిమాకి గొప్పగా ఎదిగారు. ఇప్పుడు ఈ సినిమాతో ఆయనతో పని చేయడం చాలా ఆనందంగా వుంది.

సినిమాకి సంగీతం, సాహిత్యం ప్రాణం అని భావిస్తుంటాను. కీరవాణి (MM Keeravani)గారు యుగపురుషుడు. ఒక సంగీత దర్శకుడికి ఎంత ప్రావీణ్యం ఉండాలో అంత ప్రావీణ్యం వున్న సంగీత దర్శకుడాయన. ఆయనతో నా మొదటి సినిమాకి పని చేయడం నా అదృష్టం. ఆయన నాకు మర్చిపోలేని పాటలు, నేపధ్య సంగీతం ఇచ్చారు. అలాంటి మహానుభావుడితో ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. ఆయన కథ విని చాలా ఆనందంగా ఫీలయ్యారు. ఒక పెద్దన్నయ్యలా సలహాలు సూచనలు ఇచ్చారు. ఆయనకి సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

సాహిత్య చిచ్చరపిడుగు చంద్రబోస్ (Chandra Bose) ఈ సినిమాకి సాహిత్యం అందిస్తున్నారు. ఆయన సాహిత్యం మహా అద్భుతంగా వుండబోతోంది. నేను పరిచయం చేసిన ఎంతో మంది హీరోయిన్స్ స్టార్స్‌గా వెలిగారు. అయితే ఇందులో చాలా మంది ముంబై నుంచి వచ్చిన వారే. ఈసారి మన తెలుగు నుంచి ఒక అమ్మాయిని పరిచయం చేయాలని భావించాం. ఇలాంటి సమయంలో ఓ అమ్మాయి తారసపడింది. తను అద్భుతంగా వుంది. అందమైన తెలుగు భారతీయ అమ్మాయిలా అనిపించింది. గొప్ప రూప సౌందర్యం వుంది. ఆమె పేరు వీణ రావు. మన తెలుగమ్మాయి. తను మంచి కూచిపూడి డ్యాన్సర్. ఈ మూవీలో అతిరథ మహారథులు ఇంకెందరో వుంటారు. అలాగే కొత్త ట్యాలెంట్‌ని కూడా ప్రోత్సహిస్తున్నాం. సోషల్ మీడియా వేదికగా వివరాలు చెబుతాం. మేము చెప్పిన ప్రమాణాలు అనుగుణంగా మీ ట్యాలెంట్స్‌ని మాకు పంపించవచ్చు. అందులో నుంచి కొంతమందిని ఎంపిక చేస్తాం’’ అన్నారు. న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్‌లో వైవిఎస్ చౌదరి, కీరవాణి, చంద్రబోస్ వంటి మహామహులతో కలిసి పని చేసే అవకాశం ఇచ్చిన నిర్మాత యలమంచిలి గీతకు డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ధన్యవాదాలు తెలిపారు.

Read Latest Cinema News

Updated Date - Aug 09 , 2024 | 07:51 PM