పాటతో పూర్తి
ABN, Publish Date - Nov 02 , 2024 | 07:02 AM
తమిళ హీరో ధనుష్, నాగార్జున, రష్మిక కాంబినేషన్‌లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘కుబేర’ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్‌మోహన్
తమిళ హీరో ధనుష్, నాగార్జున, రష్మిక కాంబినేషన్‌లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘కుబేర’ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్‌మోహన్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం ఓ పాటను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. ఈ పాటతో షూటింగ్ పూర్తవుతుందని నిర్మాతలు చెప్పారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంతో జరుగుతోందని తెలిపారు. ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 15న విడుదల చేస్తామని నిర్మాతలు చెప్పారు. పాత్రలు, వాటి నేపథ్యాలను లోతుగా ఆవిష్కరించే విధంగా టీజర్ ఉంటుందని తెలిపారు. దీపావళి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. జిమ్ పర్ఫ్ కీలక పాత్ర పోషిస్తున్న ‘కుబేర’ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలవుతుంది.