పతంగుల పోటీ
ABN, Publish Date - Oct 16 , 2024 | 05:59 AM
పతంగుల పోటీ కథతో రూపుదిద్దుకున్న స్పోర్ట్స్ డ్రామా ‘పతంగ్’. డిసెంబర్ 27న విడుదల కానుంది. ఇన్‌స్టాగ్రమ్ సెన్సేషన్ ప్రీతి పగడాల, జీ సరిగమ రన్నరప్ ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ ముఖ్య పాత్రలు...
పతంగుల పోటీ కథతో రూపుదిద్దుకున్న స్పోర్ట్స్ డ్రామా ‘పతంగ్’. డిసెంబర్ 27న విడుదల కానుంది. ఇన్‌స్టాగ్రమ్ సెన్సేషన్ ప్రీతి పగడాల, జీ సరిగమ రన్నరప్ ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ ముఖ్య పాత్రలు పోషించారు. అలాగే ఎస్పీ చరణ్ ఓ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వంలో విజయశేఖర్ అన్నే, సంపత్ మక, సురేశ్ కొత్తింటి నిర్మించారు. నాని బండ్రెడ్డి క్రియేటివ్ నిర్మాత. యూత్ ఫెస్టివల్‌లా ఈ సినిమా ఉంటుందనీ, చిత్రానికి కథే హీరో అని నిర్మాతలు చెప్పారు.