దసరాకి వస్తున్నాం
ABN, Publish Date - Sep 10 , 2024 | 03:38 AM
సుహాస్, సంగీర్తన జంటగా దిల్ రాజు ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ‘జనక అయితే గనక’ చిత్రం కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. దసరా సందర్భంగా అక్టోబరు 12న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. సందీప్‌రెడ్డి దర్శకుడు...
సుహాస్, సంగీర్తన జంటగా దిల్ రాజు ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ‘జనక అయితే గనక’ చిత్రం కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. దసరా సందర్భంగా అక్టోబరు 12న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. సందీప్‌రెడ్డి దర్శకుడు. శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ వీడియో విడుదల చేశారు. ఈ సినిమా ఓవర్‌సీస్ హక్కులు సొంతం చేసుకున్న సుహాస్‌కి అందరూ ఫోన్ చేసి రిలీజ్ ఎప్పుడు అని అడుగుతుంటారు. ఈ గోల భరించలేక సుహాస్ దిల్ రాజుకు పోన్ చేసి రిలీజ్ డేట్ గురించి అడగడం, ‘మనది ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే సినిమా కనుక దసరా సందర్బంగా అక్టోబర్ 12న విడుదల చేస్తున్నాం’ అని చెప్పడం .. ఇలా ఆసక్తికరంగా ఆ వీడియో రూపొందించారు.