కాలేజ్‌ రోజులు గుర్తొచ్చాయి

ABN, Publish Date - Sep 11 , 2024 | 04:18 AM

దిలీ్‌పప్రకాశ్‌, రెజీనా కసాండ్ర జంటగా నటించిన ‘ఉత్సవం’ చిత్రం ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో రెజీనా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ చిత్రవిశేషాలు వెల్లడించారు...

దిలీ్‌పప్రకాశ్‌, రెజీనా కసాండ్ర జంటగా నటించిన ‘ఉత్సవం’ చిత్రం ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో రెజీనా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ చిత్రవిశేషాలు వెల్లడించారు.

  • ఈ చిత్రకథను దర్శకుడు అర్జున్‌ సాయి చెప్పినప్పుడు అద్బుతంగా అనిపించింది. కథలో సోల్‌ ఉంది. నాటకరంగం గురించి ఆయన చాలా రిసెర్చ్‌ చేసి కథ తయారు చేశారు. స్కూల్‌లో, కాలేజీలో చదువుకొనే రోజుల్లో నాటకాలు వెయ్యడం, టికెట్లు అమ్మడం.. ఇవన్నీ నాకు వెంటనే గుర్తొచ్చాయి. సినిమాలో రంగస్థల నటుల గురించి చాలా అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయి. ‘ఉత్సవం’ సందేశాత్మక చిత్రం కాదు. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్న సినిమా. నాకు బాగా నచ్చి వెంటనే ఒప్పుకొన్నా.

  • చిత్రంలో నేను కార్పొరేట్‌ ఎంప్లాయిగా నటించాను. ప్రేమ మీద నా పాత్రకు పెద్దగా ఆసక్తి ఉండదు. కథలో ఎంతో కీలకమైన పాత్ర. ఇటువంటి పాత్ర చేసే అవకాశం రావడం ఆనందంగా అనిపించింది.


  • నా కో స్టార్‌ దిలీప్‌ మంచి నటుడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. తనతో వర్క్‌ చేయడం చాలా ఎంజాయ్‌ చేశాను. నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే రాజేంద్రప్రసాద్‌, ప్రకాశ్‌రాజ్‌, నాజర్‌ వంటి సీనియర్స్‌తో కలసి నటించడం వల్ల చాలా నేర్చుకున్నాను. దర్శకుడు అర్జున్‌ సాయి తన తొలి సినిమాకు ఇలాంటి గొప్పకథను ఎన్నుకోవడం, ఆయనకు మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ సపోర్ట్‌ ఇచ్చి సినిమాను విడుదల చేయడం హ్యాపీగా అనిపిస్తోంది.

  • నా తొలి సినిమా ‘ఎస్‌.ఎం.ఎస్‌.’ చేస్తున్నప్పుడే మంచి నటిగా పేరు తెచ్చుకోవాలనుకున్నాను. అందుకే ఇన్నాళ్లూ విభిన్న పాత్రలు చేస్తూ వచ్చాను. అన్ని రకాల పాత్రలు చేయడమే నా గోల్‌

Updated Date - Sep 11 , 2024 | 04:18 AM