అద్భుతమైన విజువల్స్‌తో ‘చుట్టమల్లే’
ABN, Publish Date - Aug 06 , 2024 | 05:03 AM
జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘దేవర’. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా, సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు...
జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘దేవర’. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా, సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ ఇందులో కథానాయికగా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ ‘ఫియర్’ సినిమాపై అంచనాలను తారస్థాయిలో పెంచాయి. సోమవారం ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్‌ను విడుదల చేశారు. ‘చుట్టమల్లె’ అంటూ సాగే ఈ రొమాంటిక్ సాంగ్‌లో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ, అద్భుతమైన విజువల్స్ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా, శిల్పా రావ్ ఆలపించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం, బాస్కో మార్టిస్ కొరియోగ్రఫీ అందించారు. కాగా, ‘దేవర పార్ట్ 1’ సెప్టెంబర్ 27న విడుదలవుతోంది.