Pranayagodari: ‘గు గు గ్గు..’ మాస్ బీట్ సాంగ్ వదిలిన గణేష్ మాస్టర్..

ABN, Publish Date - Aug 31 , 2024 | 07:23 PM

న్యూ కంటెంట్‌తో రిఫ్రెషింగ్‌ ఫీల్‌తో రూపొందుతోన్న చిత్రం ‘ప్రణయగోదారి’. పి.ఎల్. విఘ్నేష్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పారమళ్ళ లింగయ్య నిర్మిస్తున్నారు. డిఫెరెంట్ కంటెంట్‌తో ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్‌. ఈ చిత్రంలో సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘గు.. గు.. గ్గు’ అనే మాస్ బీట్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Pranayagodari Movie song Launch Event

న్యూ కంటెంట్‌తో రిఫ్రెషింగ్‌ ఫీల్‌తో రూపొందుతోన్న చిత్రం ‘ప్రణయగోదారి’ (Pranayagodari). పి.ఎల్. విఘ్నేష్ (PL Vignesh) దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పారమళ్ళ లింగయ్య నిర్మిస్తున్నారు. డిఫెరెంట్ కంటెంట్‌తో ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్‌. ఈ చిత్రంలో సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి ‘గు.. గు.. గ్గు’ (Gu Guggu Lyrical Song) అనే మాస్ బీట్ సాంగ్‌ని కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ (Choreographer Ganesh Master) చేతుల మీదుగా విడుదల చేశారు.

Also Read-NBK: ఎన్ని బిరుదులు, ట్యాగ్స్ తగిలించినా.. బాలయ్యకు అలా పిలిస్తేనే ఇష్టం

పాట విడుదల అనంతరం గణేష్ మాస్టర్ మాట్లాడుతూ.. ‘ప్రణయ గోదారి’ సినిమాలోని ‘గు గు గ్గు..’ అనే ప్రత్యేక గీతాన్ని విడుదల చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ పాట చాలా బాగుంది. ఇందులో హుక్ స్టెప్స్ బాగున్నాయి. ఈ పాట పబ్లిక్‌లోకి వెళ్లిన తర్వాత ఆ హుక్‌ స్టెప్స్ రీల్స్ వైరల్ అవడం కాయం. మంచి కంటెంట్‌తో వస్తోన్న ఈ మూవీని అందరూ ఆదరించాలి. విఘ్నేశ్ గారు తెరకెక్కించిన ‘ప్రణయ గోదావరి’ చిత్రం పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.


‘గు గు గ్గు..’ అంటూ సాగే ఈ పాటకు మార్కండేయ బాణీ, సాహిత్యం స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి. భార్గవి పిల్లై గాత్రం కుర్రకారుని కట్టి పడేసేలా ఉంది. ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు విడుదలైన కంటెంట్‌ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇప్పుడు మరో పాటను విడుదల చేశాం. గణేష్ మాస్టర్ ఈ పాటను విడుదల చేసి, టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపినందుకు ఆయనకు ధన్యవాదాలు. సినిమాకు సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని తెలిపారు.

Read Latest Cinema News

Updated Date - Aug 31 , 2024 | 07:23 PM