Chinmayi: అత్యాచార ఘటనపై నిలదీసేవారు ఎవరు?

ABN, Publish Date - Jul 14 , 2024 | 05:16 PM

నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో ఎనిమిదేళ్ల చిన్నారిని ముగ్గురు మైనర్లు అతి దారుణంగా అత్యాచారం చేశారు. అనంతరం శవం కూడా దొరకకుండా ఎత్తి పోతల అప్రోచ్‌ కాలువలో పడేశారు

నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో ఎనిమిదేళ్ల చిన్నారిని ముగ్గురు మైనర్లు అతి దారుణంగా అత్యాచారం చేశారు. అనంతరం శవం కూడా దొరకకుండా ఎత్తి పోతల అప్రోచ్‌ కాలువలో పడేశారు. ఈ దారుణ ఘటన జరిగి నేటికి వారం రోజులు అవుతోంది. కానీ బాలిక (Child rape case) మృత దేహం మాత్రం ఇంతవరకు లభ్యం కాలేదు. దీంతో  మృతురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ దారుణ ఘటనపై సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. ఇప్పటికే యాంకర్‌ రష్మీ గౌతమ్‌ (Rashmi gautam)ఈ కేసులో నిందితులుగా ఉన్న మైనర్లను కఠినంగా శిక్షించాలని కోరింది. తాజాగా గాయని చిన్మయి 9Chinmayi) ఈ అత్యాచార ఘటనపై స్పందించారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ఒక వీడియోను రిలీజ్‌ చేశారామె. ఇందులో డార్క్‌ కామెడీ, మీమ్స్‌, ట్రోల్స్‌ చేసే వారిపైనా ఆమె విరుచుకు పడింది. తద్వారా ప్రణీత్‌ హనుమంతు (Praneeth Hanumanthu)లాంటి యూట్యూబర్లను ఏ మాత్రం ఎంకరేజ్‌ చేయవద్దంటూ సూచించింది. ప్రస్తుతం ఈ వీడియో ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

‘‘రేప్‌లు (Gang Rape) చేసే వారిని చూసి అందరూ మండిపడుతున్నారు. కానీ మన పక్కనే ఉంటూ అడల్ట్‌ జోక్స్‌ వేేస వారిని మాత్రం అసలు నిలదీయలేకపోతున్నాం. ఇలాంటి మీమ్స్‌, ట్రోల్స్‌, జోక్స్‌ ఎందుకు వేస్తున్నారని అడిగే దమ్ము మన దగ్గర లేకపోయింది. ఒకవేళ ఇలాంటి వాటి మీద స్పందిస్తే మాత్రం యాంటీ నేషనల్‌, ఫెమినిస్ట్‌, అర్బన్‌ నక్సల్స్‌ అంటూ విమర్శిస్తారు. మూడో తరగతి చదువుతున్న ఆడబిడ్డ మీద మైనర్‌ బాలురు చేసిన హత్యాచార ఘటన మీద అందరూ రియాక్ట్‌ అవుతున్నారు. అసలు సభ్య సమాజం ఎటు పోతుంది. ఏమైపోతోంది.. పిల్లలకు ఫోన్లు ఇవ్వొద్దు.. పిల్లలకు ఇంటర్నెట్‌ కనెక్షన్‌ కట్‌ చేయాలని అంటున్నారు. దురదృష్టవ శాత్తూ అలాంటి వారే మళ్లీ సామాజిక మాధమాల్లో అడల్ట్‌ కామెడీ, మీమ్స్‌, ట్రోల్స్‌, డార్క్‌ కామెడీ అంటూ పిచ్చి పిచ్చిగా కామెంట్లు చేస్తున్నారు’ అని వీడియోలో చెప్పుకొచ్చింది చిన్మయి.


Updated Date - Jul 14 , 2024 | 05:20 PM