చేతిలో చెయ్యేసి...

ABN, Publish Date - Oct 25 , 2024 | 02:27 AM

ఇటీవలే విడుదలై సూపర్‌ సక్సెస్‌ సాధించిన ‘దేవర’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో ‘ఆర్‌సీ16’.. వరుణ్‌ ధావన్‌తో ‘సన్నీ సంస్కారీ కీ...

ఇటీవలే విడుదలై సూపర్‌ సక్సెస్‌ సాధించిన ‘దేవర’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో ‘ఆర్‌సీ16’.. వరుణ్‌ ధావన్‌తో ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారీ’ చిత్రాలలో నటిస్తున్నారీ బ్యూటీ. రీసెంట్‌గా బాలీవుడ్‌ డిజైనర్‌ మనీశ్‌ మల్హోత్రా దీపావళి పార్టీని ముంబైలో ఏర్పాటు చేశారు. ఈ విందులో జాన్వీ తన బాయ్‌ఫ్రెండ్‌ శిఖర్‌ పహీరియాతో కలసి సందడి చేశారు. శిఖర్‌తో, జాన్వీ చేతిలో చెయ్యేసి తీసుకున్న ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ పార్టీలో షాహిద్‌ కపూర్‌, కార్తీక్‌ ఆర్యన్‌, ఆలియా భట్‌, కాజోల్‌, త్రిప్తి దిమ్రితో పాటు నాగచైతన్యకు కాబోయే సతీమణి శోభితా ధూళిపాళ్ళ కూడా తళుక్కున మెరిశారు.

Updated Date - Oct 25 , 2024 | 02:27 AM