మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Love Guru: ‘లవ్ గురు’ మూవీ నుంచి హార్ట్ టచింగ్ సాంగ్..

ABN, Publish Date - Feb 23 , 2024 | 03:28 PM

విజయ్ ఆంటోనీ తొలిసారి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ జానర్‌లో నటిస్తున్న తమిళ ‘రోమియో’ మూవీ తెలుగులో ‘లవ్ గురు’గా విడుదల కాబోతోంది. మృణాళిని రవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘చెల్లెమ్మవే..’ అనే సిస్టర్ సెంటిమెంట్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

Vijay Antony in Love Guru

వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో మూవీస్ చేస్తూ.. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును పొందిన హీరో విజయ్ ఆంటోనీ (Vijay Antony). తన ప్రతి సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు విజయ్ ఆంటోనీ తొలిసారి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ జానర్‌లో నటిస్తున్న తమిళ ‘రోమియో’ మూవీ తెలుగులో ‘లవ్ గురు’గా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో విజయ్ ఆంటోని సరసన మృణాళిని రవి (Mrinalini Ravi) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. వినాయక్ వైద్యనాథన్ (Vinayak Vaidyanathan) దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘చెల్లెమ్మవే..’ (Chellammavey Lyrical Song) అనే సిస్టర్ సెంటిమెంట్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఈ పాటకు భాష్యశ్రీ లిరిక్స్ అందించగా.. భరత్ ధనశేఖర్ స్వరాలు సమకూర్చారు. ఆదిత్య ఆర్కే ఆలపించారు. ‘చెల్లెమ్మవే చెయ్యి పట్టుకోవే.. నా చెల్లివే.. నువు నా చెల్లివే.. నేనున్నదే నీ కోసమే.. విధి రాసెనే, ఒక రాతనే... ఆ ఆటలో ఎద కృంగెనే..’ అంటూ హీరో తన సోదరిని తల్చుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలతో ఎమోషనల్‌గా సాగుతుందీ పాట. రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హార్ట్ టచింగ్ సెంటిమెంట్ కూడా ఉంటుందనే విషయం ఈ పాటతో వెల్లడవుతోంది. (Chellammavey Song From Love Guru)


పాట విడుదల సందర్భంగా సంగీత దర్శకుడు భరత్ ధనశేఖర్ మాట్లాడుతూ.. ఈ సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం కావడం సరికొత్త అనుభూతిని మిగిల్చింది. ఈ చిత్ర విజయానికి నేను సమకూర్చిన సంగీతం కూడా ఒక కారణంగా ఉంటుందని బలంగా నమ్ముతున్నానని పేర్కొన్నారు. ఈ సినిమాను సమ్మర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విజయ్ ఆంటోనీ ఈ సినిమాతో మరింతగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. వీటీవీ గణేష్, తలైవాసల్ విజయ్, ఇళవరసు, సుధ, శ్రీజ రవి తదితరులు ఇతర పాత్రలలో నటిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Tantra: పిల్ల బచ్చాల్లారా.. మా సినిమాకు రావద్దు.. వార్నింగ్ అదిరింది

************************

*Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ RC 16పై ఇలా ట్విస్ట్ ఇచ్చిందేంటి?

************************

*BVS Ravi: ఆత్మలని పిలవకుండా.. వాళ్లింట్లోనే పేరంటమా?

**************************

Updated Date - Feb 23 , 2024 | 03:28 PM