వారంలోగా తేల్చండి చిత్రం ‘ఎమర్జెన్సీ’
ABN, Publish Date - Sep 20 , 2024 | 01:21 AM
కంగనా రనౌత్, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటించి.. స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. సెన్సార్ చిక్కులతో చిత్రం విడుదల వాయిదా పడుతోంది. అయితే ఈ సినిమా సెన్సార్ సర్టిఫికేట్ విషయంలో వారంలోగా ఓ నిర్ణయానికి రావాలని...
కంగనా రనౌత్, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటించి.. స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. సెన్సార్ చిక్కులతో చిత్రం విడుదల వాయిదా పడుతోంది. అయితే ఈ సినిమా సెన్సార్ సర్టిఫికేట్ విషయంలో వారంలోగా ఓ నిర్ణయానికి రావాలని బాంబే హైకోర్టు సెన్సార్ బోర్డును ఆదేశించింది. ఈ సినిమా సెప్టెంబర్ 6న విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ చిత్రంలో సిక్కు వర్గాన్ని కించపరిచే సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి సినిమా విడుదలను నిలిపివేయాలని కొన్ని సంస్థలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దీనిపై విచారణ జరిపిన కోర్టు వారి వాదనలను పరిగణలోకి తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు సూచించింది. మరోవైపు కంగన, చిత్ర నిర్మాణసంస్థ జీ ఎంటర్టైన్‌మెంట్స్ ఈ విషయమై బాంబే కోర్టును ఆశ్రయించగా, సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వమని.. సెన్సార్ బోర్డును ఆదేశించలేమని బాంబే హైకోర్టు తెలిపింది. ఈ క్రమంలోనే తాజా విచారణ అనంతరం వారంలోపు ఓ నిర్ణయానికి రావాలని బాంబే కోర్టు సెన్సార్ బోర్డుకు సూచించింది.