40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విడాకుల వార్తలకు చెక్‌

ABN, Publish Date - Feb 01 , 2024 | 02:57 AM

సూర్య, జ్యోతిక దంపతులు తాము విడిపోబోవడం లేదని చెప్పకనే చెప్పారు. తమ విదేశీ విహార యాత్రతో విడాకుల వదంతులకు ముగింపు పలికారు. సినిమాలకు విరామం ఇచ్చిన సూర్య, జ్యోతిక ఫిన్లాండ్‌ వెళ్లి ఆనందంగా గడిపారు...

సూర్య, జ్యోతిక దంపతులు తాము విడిపోబోవడం లేదని చెప్పకనే చెప్పారు. తమ విదేశీ విహార యాత్రతో విడాకుల వదంతులకు ముగింపు పలికారు. సినిమాలకు విరామం ఇచ్చిన సూర్య, జ్యోతిక ఫిన్లాండ్‌ వెళ్లి ఆనందంగా గడిపారు. ఆ వీడియోను బుధవారం సోషల్‌ మీడియాలో జ్యోతిక షేర్‌ చేశారు. ఇలాంటి పర్యటనలతో ఈ ఏడాదంతా తమకు ఆహ్లాదం పంచాలని ఆమె ఆకాంక్షించారు. చాన్నాళ్ల తర్వాత సూర్య, జ్యోతిక కలసి కనిపించడంతో వారు విడిపోబోతున్నారనే వార్తలకు ఇక ముగింపు పలికినట్లైందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. పిల్లల చదువు, బాలీవుడ్‌ సినిమాలు చేస్తుండడంతోనే తాను ముంబైలో ఉంటున్నాననీ, తమ వైవాహిక జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేవని జ్యోతిక గతంలోనూ పలు సందర్భాల్లో తెలిపారు. సూర్య నటించిన ‘కంగువ’ చిత్రం త్వరలోనే విడుదలవనుంది. ‘సైతాన్‌’, ‘శ్రీ’తో పాటు మరో హిందీ చిత్రంలోనూ జ్యోతిక నటిస్తున్నారు.

Updated Date - Feb 01 , 2024 | 02:57 AM