మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rathnam: ‘చెబుతావా'.. విశాల్ ‘రత్నం’ నుంచి మరో పాటొచ్చింది

ABN, Publish Date - Apr 10 , 2024 | 05:59 PM

మాస్, యాక్షన్ హీరో విశాల్ ప్రస్తుతం ‘రత్నం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. యాక్షన్ డైరెక్టర్ హరి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. హరి దర్శకత్వంలో రాబోతోన్న ఈ సినిమాపై ఎటువంటి అంచనాలు ఉన్నాయో తెలియంది కాదు. ఏప్రిల్ 26న విడుదల కాబోతోన్న ఈ సినిమా నుంచి ఉగాది స్పెషల్‌గా ‘చెబుతావా’ అనే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Vishal in Rathnam Movie

మాస్, యాక్షన్ హీరో విశాల్ (Vishal) ప్రస్తుతం ‘రత్నం’ (Rathnam) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. జీ స్టూడియోస్‌తో పాటు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. యాక్షన్ డైరెక్టర్ హరి (Director Hari) ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. హరి దర్శకత్వంలో రాబోతోన్న ఈ సినిమాపై ఎటువంటి అంచనాలు ఉన్నాయో తెలియంది కాదు. ఈ మూవీని శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్‌పై తెలుగులో సీహెచ్ సతీష్ కుమార్, కే రాజ్ కుమార్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, సాంగ్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో మంచి ఆదరణను దక్కించుకోగా, ఉగాదిని పురస్కరించుకుని తాజాగా ఈ సినిమా నుంచి ‘చెబుతావా’ (Chebuthava Lyrical Song) అనే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.

*Tharun Bhascker: తరుణ్ భాస్కర్ కొత్త సినిమా, ఈషా రెబ్బా కథానాయిక


ఈ సినిమాలో విశాల్‌ (Vishal)కి జోడిగా ప్రియా భవాని శంకర్ (Priya Bhavani Shankar) నటించారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయినట్టుగా మేకర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సినిమా ఏప్రిల్ 26న విడుదల కానుంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న క్రమంలో ప్రమోషన్స్‌పై మేకర్స్ దృష్టి పెట్టారు. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ‘చెబుతావా’ పాట మంచి మెలోడియస్‌గా, ఎమోషనల్ సాంగ్‌గా మెప్పిస్తోంది. ఈ పాటకు శ్రీమణి సాహిత్యం, సింధూరి విశాల్ గాత్రాన్ని అందించారు. దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఇచ్చిన బాణీ వినసొంపుగా ఉంది. కళ్యాణ్ సుబ్రహ్మణ్యం అలంకార్ పాండియన్ కో-ప్రోడ్యుసర్‌గా రాబోతోన్న ఈ మూవీకి ఎం సుకుమార్ కెమెరామెన్‌గా, టీ ఎస్ జై ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ 26న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Devara: ‘లైగర్’ నిర్మాత చేతికి ‘దేవర’.. ఆ చిక్కులు తప్పవా!

*********************

*Vettaiyan: కమల్ హాసనే కాదు.. రజినీకాంత్ కూడా అప్డేట్ ఇచ్చాడు..

****************************

Updated Date - Apr 10 , 2024 | 05:59 PM