మోసపోయా.. ఆత్మహత్య చేసుకుంటా
ABN, Publish Date - Jul 14 , 2024 | 02:47 AM
నటుడు రాజ్ తరుణ్, అతని ప్రియురాలు లావణ్య వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. రాజ్ తరుణ్ 11 ఏళ్లు తనతో సహజీవనం చేసి.. ఇప్పుడు మాల్వీ మల్హోత్రా అనే హీరోయిన్‌తో తిరుగుతూ...
నటుడు రాజ్ తరుణ్, అతని ప్రియురాలు లావణ్య వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. రాజ్ తరుణ్ 11 ఏళ్లు తనతో సహజీవనం చేసి.. ఇప్పుడు మాల్వీ మల్హోత్రా అనే హీరోయిన్‌తో తిరుగుతూ తనను దూరం పెడుతున్నాడంటూ కేసు పెట్టిన లావణ్య.. శుక్రవారం రాత్రి ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్టు తెలిసింది. ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ తన న్యాయవాదికి వాట్సాప్ చాటింగ్‌లో చెప్పడం.. ఆయన 112కు ఫోన్ చేయడంతో నార్సింగ్ పోలీసులు వెంటనే ఆమె ఇంటికి చేరుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. తనకు రూ.5 కోట్లు ఇస్తామని, కేసు వెనక్కి తీసుకోవాలని కొందరు బెదిరిస్తున్నారని న్యాయవాదితో చాటింగ్‌లో ఆమె పేర్కొన్నారు. రాజ్ తరుణ్ చేతిలో దారుణంగా మోసపోయాయని, ప్రతిదీ ఓ పథకం ప్రకారం జరిగిందన్నారు. అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని, తన చావుకు రాజ్ తరుణ్, అతని తల్లిదండ్రులతో పాటు మాల్వీ మల్హోత్రాకారణమని పేర్కొన్నారు.
లావణ్య శనివారం తన న్యాయవాదితో కలిసి నార్సింగ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరై రాజ్ తరుణ్‌తో తనకు ఉన్న సంబంధంపై పలు విషయాలు వెల్లడించినట్లు తెలిసింది. నార్సింగ్ పోలీసులు పలు సెక్షన్ల కింద మాల్య, మయాంక్, రాజ్ తరుణ్‌పై కేసు నమోదు చేశారు.
హైదరాబాద్ సిటీ/నార్సింగ్ (ఆంధ్రజ్యోతి)