Sharwa38: శర్వానంద్ 38వ చిత్రం.. దర్శకుడు ఎవరంటే
ABN, Publish Date - Sep 19 , 2024 | 04:17 PM
టాలీవుడ్ హీరోలలో వెర్సటైల్ పెర్ఫార్మెన్స్‌తో, డిఫరెంట్ స్క్రిప్ట్‌లతో అలరిస్తోన్న హీరో ఎవరయ్యా అంటే.. వెంటనే శర్వానంద్ పేరే వినబడుతుంది. ఇప్పుడు శర్వానంద్ మరో పవర్ ఫుల్ సబ్జెక్ట్‌తో, పాన్ ఇండియా స్థాయిలో తన ప్రతిభను కనబరిచేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా ఆయన నటించనున్న 38వ చిత్ర వివరాలను మేకర్స్ విడుదల చేశారు.
టాలీవుడ్ హీరోలలో వెర్సటైల్ పెర్ఫార్మెన్స్‌తో, డిఫరెంట్ స్క్రిప్ట్‌లతో అలరిస్తోన్న హీరో ఎవరయ్యా అంటే.. వెంటనే శర్వానంద్ పేరే వినబడుతుంది. హిట్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా.. ప్రతి చిత్రంలోనూ ఏదో ఒక వెరైటీని శర్వానంద్ (Sharwanand) ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #Sharwa38 కోసం మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో పేరు పొందిన బ్లాక్‌బస్టర్ మేకర్ సంపత్ నంది (Sampath Nandi)తో చేతులు కలిపారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై హై బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ప్రముఖ నిర్మాత కెకె రాధామోహన్ (KK Radhamohan) ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటనను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు.
Also Read- NagaBabu: నాగబాబు కొటేషన్స్.. కొరియోగ్రాఫర్ కోసమేనా
ఇది1960లో ఉత్తర తెలంగాణ, తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో రూరల్ బ్యాక్ డ్రాప్‌లో సాగే పల్సేటింగ్ పీరియడ్ యాక్షన్ డ్రామా. #Sharwa38 గ్రిప్పింగ్ యాక్షన్, ఎమోషనల్ చార్జ్డ్ సీక్వెన్స్‌లతో ఇంటెన్స్ నెరేటివ్‌గా వుంటుంది. ఇంతకు ముందెన్నడూ చూడని ఎలిమెంట్స్‌తో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మూవీగా వుండబోతోందని మేకర్స్ తెలిపారు. ఈ సబ్జెక్ట్‌లో యూనివర్సల్ అప్పీల్ వుండటంతో మేకర్స్ దీనిని పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. శర్వానంద్, సంపత్ నంది ఇద్దరికీ ఇది మెడిన్ పాన్ ఇండియా మూవీ.
సినిమా కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్‌ని రెడీ చేసిన దర్శకుడు, శర్వాను మునుపెన్నడూ చూడని క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేయనున్నారని0, 60ల నాటి క్యారెక్టర్‌ని పోషించేందుకు శర్వా కంప్లీట్‌గా మేకోవర్ అయ్యారని చిత్ర బృందం చెబుతోంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో మంటలు చెలరేగుతున్నట్లు కనిపించడం ఆసక్తికరంగా వుంది. #Sharwa38కి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. సౌందర్ రాజన్ ఎస్ కెమెరామ్యాన్‌గా పని చేస్తుండగా, సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నారు. కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి పని చేసే తారాగణం, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో మేకర్స్ తెలియజేయనున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
Also Read- Poonam Kaur: అప్పట్లో నా మాట పట్టించుకోలేదు.. త్రివిక్రమ్ పై పూనమ్ సంచలన వ్యాఖ్యలు
Read Latest Cinema News