ఆకట్టుకునే చిన్న కథ

ABN, Publish Date - Jul 21 , 2024 | 01:41 AM

నివేదా థామస్‌, ప్రియదర్శి, విశ్వదేవ్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘35-చిన్న కథ కాదు’. గౌతమి, భాగ్యరాజ్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. నందకిషోర్‌ ఈమాని దర్శకత్వం వహిస్తున్నాడు...

నివేదా థామస్‌, ప్రియదర్శి, విశ్వదేవ్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘35-చిన్న కథ కాదు’. గౌతమి, భాగ్యరాజ్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. నందకిషోర్‌ ఈమాని దర్శకత్వం వహిస్తున్నాడు. హీరో రానా దగ్గుబాటి, సృజన్‌ యరబోలు, సిద్ధార్థ్‌ రాళ్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆగస్టు 15న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది. ఈ చిత్రంలో విశ్వదేవ్‌ పాత్రను పరిచయం చేస్తూ చిత్రబృందం ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ప్రసాద్‌ అనే మధ్యతరగతి తండ్రి పాత్రలో విశ్వదేవ్‌ నటన ఆకట్టుకుంది. ఇది చిన్న కథ కాదు ప్రేక్షకులను ఆకట్టుకునే కథ అని మేకర్స్‌ తెలిపారు. వివేక్‌ సాగర్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. సినిమాటోగ్రఫీ: నికేత్‌ బొమ్మి, ఎడిటర్‌: టి.సి ప్రసన్న

Updated Date - Jul 21 , 2024 | 01:41 AM