అల్లు అర్జున్‌కు చంద్రబాబు ఫోన్‌

ABN, Publish Date - Dec 15 , 2024 | 01:47 AM

సినీ హీరో అల్లు అర్జున్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్‌ చేసి మాట్లాడారు. శనివారం అల్లు అర్జున్‌ జైలు నుంచి విడుదలై ఇంటికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఆయనకు ఫోన్‌ చేసి...

సినీ హీరో అల్లు అర్జున్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్‌ చేసి మాట్లాడారు. శనివారం అల్లు అర్జున్‌ జైలు నుంచి విడుదలై ఇంటికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఆయనకు ఫోన్‌ చేసి పరామర్శించారని తెలుగుదేశం పార్టీ వర్గాలు తెలిపాయి. ఏం జరిగిందో అడిగి తెలుసుకొని భరోసా ఇచ్చారని వివరించాయి. అల్లు అర్జున్‌ అరెస్టు జరిగిన తర్వాత శుక్రవారం రాత్రి ఆయన తండ్రి అల్లు అరవింద్‌కు చంద్రబాబు ఫోన్‌ చేసి మాట్లాడారు. ఆందోళన చెందవద్దని, సమస్య పరిష్కారం అవుతుందని ధైర్యం చెప్పారని సమాచారం.

అమరావతి (ఆంధ్రజ్యోతి)

Updated Date - Dec 15 , 2024 | 01:47 AM