Case No 15: ‘కేస్‌ నం. 15’ విడుదలకు సిద్ధం!

ABN, Publish Date - Jul 09 , 2024 | 05:21 PM

అజయ్‌, రవిప్రకాశ్‌, హర్షిణి, మాండవియా సెజల్‌, కీలక పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కేస్‌ నం. 15’. బీజీ వెంచర్స్‌ పతాకంపై స్వీయ దర్శకత్వంలో తడకల శంకర్‌ రాజేశ్‌ రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకొస్తుంది.



అజయ్‌(Ajay), రవిప్రకాశ్‌, హర్షిణి, మాండవియా సెజల్‌, కీలక పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కేస్‌ నం. 15’ (Case No 15). బీజీ వెంచర్స్‌ పతాకంపై స్వీయ దర్శకత్వంలో తడకల శంకర్‌ రాజేశ్‌ (tadakala Rajesh Shankar) రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా తడకల రాజేష్‌ మాట్లాడుతూ "సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందించిన చిత్రం ఇది. బలమైన కథాశంతో తెరకెక్కించిన ఈ చిత్రంలోని సన్నివేశాలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తాయి. జాన్‌ అందించిన సంగీతం, ఆనం వెంకట్‌ సినిమాటోగ్రఫీ సినిమాకు ఎసెట్‌ అవుతుంది. సి.కల్యాణ్‌ సహకారం మరువలేనిది’ అని అన్నారు.  

Updated Date - Jul 09 , 2024 | 05:24 PM