అన్యోనతను చూసి ఓర్వలేక..

ABN, Publish Date - Oct 23 , 2024 | 02:10 AM

శ్రీనివాస్‌ ఉలిశెట్టి, శాంతిప్రియ హీరో హీరోయిన్లుగా ఉదయ్‌ కుమార్‌ దర్శకత్వంలో లడ్డే బ్రదర్స్‌ నిర్మించిన చిత్రం ‘ఎంత పని చేశావ్‌ చంటి’. ఈ నెల 25న విడుదల అవుతోంది...

శ్రీనివాస్‌ ఉలిశెట్టి, శాంతిప్రియ హీరో హీరోయిన్లుగా ఉదయ్‌ కుమార్‌ దర్శకత్వంలో లడ్డే బ్రదర్స్‌ నిర్మించిన చిత్రం ‘ఎంత పని చేశావ్‌ చంటి’. ఈ నెల 25న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా నరసాపురం వైఎన్‌ఎం కళాశాలలో ఆడియో ఫంక్షన్‌ నిర్వహించారు. ‘భార్యా భర్తల అన్యోన్యతను చూసి ఓర్వలేక ఒక అమ్మాయి వాళ్ల జీవితంలోకి వస్తుంది. దాంతో కథంతా మారుతుంది. ఆ అమ్మాయి కూడా తన జీవితంలో ఓ మగాడి చేతిలో మోసపోతుంది. ఈ మగాడూ అలాంటి వాడే అనుకొని ఆ అమ్మాయి వాళ్ల జీవితంలోకి వచ్చి ఇబ్బంది పెడుతుంది. ఈ కథ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది’ అని మేకర్స్‌ తెలిపారు.

Updated Date - Oct 23 , 2024 | 02:10 AM