ఒక మహిళను ఇలా అనొచ్చా!

ABN, Publish Date - Oct 18 , 2024 | 12:48 AM

నటి, దర్శకురాలు దివ్య ఖోస్లాకుమార్‌ ఆలియా, కరణ్‌ జోహార్‌పై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవలే ఆమె ‘జిగ్రా’ సినిమా విషయమై అందులో నటించిన ఆలియాను, నిర్మాత కరణ్‌జోహార్‌ను ఉద్దేశిస్తూ...

నటి, దర్శకురాలు దివ్య ఖోస్లాకుమార్‌ ఆలియా, కరణ్‌ జోహార్‌పై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవలే ఆమె ‘జిగ్రా’ సినిమా విషయమై అందులో నటించిన ఆలియాను, నిర్మాత కరణ్‌జోహార్‌ను ఉద్దేశిస్తూ సోషల్‌మీడియాలో పోస్ట్‌ పెట్టారు. ‘‘నేను నటించిన ‘సవి’ సినిమా, ‘జిగ్రా’ సినిమా కథాంశం, ట్రీట్‌మెంట్‌ ఒకే రకంగా ఉన్నాయి. కానీ నా సినిమానే ముందుగా ప్రొడక్షన్‌లోకి వెళ్శింది. ముందుగా రిలీజైంది. ఇటీవల విడుదలైన ‘జిగ్రా’ సినిమాకు వస్తున్న కలెక్షన్లు.. చూపెడుతున్న కలెక్షన్లు పూర్తి తేడాగా ఉన్నాయి. ఒక సినిమా విజయాన్ని అందులో ఉన్న కంటెంట్‌, కళాత్మకతను బట్టి డిసైడ్‌ చేయాలి. కలెక్షన్ల పరంగా కాదు. నిజమైన హీరోయిజం అంటే ఇలాంటి తప్పుడు లెక్కలను చూపెడుతుంటే చూస్తూ ఊరుకోవడం కాదు’’ అని పేర్కొన్నారు.


దాంతో నిర్మాత కరణ్‌ జోహార్‌కు ఒళ్లు మండి దివ్య పేరు ప్రస్థావించకుండా ‘‘కొన్ని సమయాల్లో మూర్ఖులకి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండటమే ఉత్తమం’’ అని సోషల్‌మీడియాలో ఓ పోస్టు పెట్టారు. అయితే దీనిపై స్పందించిన దివ్యా ఖోస్లా ‘‘తప్పుల్ని ఎత్తిచూపితే.. ఒక మహిళను ఇలా ‘ఫూల్‌’ అనొచ్చా. నాతోనే ఇలాంటి పదాలు వాడితే.. ఇక ఇండస్ట్రీలో కొత్తవారి పరిస్థితి ఏంటి’’ అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Oct 18 , 2024 | 12:48 AM